టీఆర్‌ఎస్‌, బీజేపీపై ప్రజల్లో ఆగ్రహం

ABN , First Publish Date - 2022-08-16T07:09:07+05:30 IST

టీఆర్‌ఎస్‌, బీజేపీలపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కక్ష సాధింపు చర్యలు ఇకనైనా విడిచి పెట్టాలని మాజీ ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌, బీజేపీపై ప్రజల్లో ఆగ్రహం
మానకొండూర్‌లో పొన్నం పాదయాత్ర

తిమ్మాపూర్‌, ఆగస్టు15: టీఆర్‌ఎస్‌, బీజేపీలపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కక్ష సాధింపు చర్యలు ఇకనైనా విడిచి పెట్టాలని మాజీ ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ పార్లమెం ట్‌ పరిధిలో పొన్నం ప్రభాకర్‌ చేస్తున్న పాదయా త్రలో భాగంగా 7వ రోజు అలుగనూర్‌లోని ఓ ప్రైవే టు ఫంక్షన్‌ హాల్‌లో స్వాత్రంత్య్ర దినోత్సవం సంద ర్భంగా జాతీయ జెండా ఎగురవేసి విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్నది పాదయాత్ర కాదని కేసీఆర్‌ ప్రాయోజిత పాదయాత్ర అని పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు రెండూ ఒకటేనన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా ఉండటమే వారి ధ్యేయ మన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిచిన బండి సంజయ్‌ ఏం చేశారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మానకొం డూర్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులున్నారు. 

 మానకొండూర్‌ : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ చేపట్టిన పాదయాత్ర సోమవారం మండల కేంద్రానికి చేరుకుంది. మానకొండూర్‌ నుంచి గట్టుదుద్దెనపల్లి వరకు కొనసాగిన పాదయాత్రలో కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు వ్వతిరేకంగా రోడ్డు వెంబడి నినాదాలు చేశారు. మానకొండూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎన్నికల హమీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమ య్యాయన్నారు. ప్రజలపై ధరల భారం మోపా రన్నారు.  డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, అంజన్‌కుమార్‌, టి. సంపత్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T07:09:07+05:30 IST