రోడ్లపైకి పీటీడీ అద్దె బస్సులు

ABN , First Publish Date - 2020-11-29T05:56:15+05:30 IST

నగరంలో సిటీ బస్సుల సంఖ్య పెరగనుంది.

రోడ్లపైకి పీటీడీ అద్దె బస్సులు

వచ్చే నెల 1 నుంచి నడిపేందుకు సన్నాహాలు

ద్వారకాబస్‌స్టేషన్‌, నవంబరు 28 : నగరంలో సిటీ బస్సుల సంఖ్య పెరగనుంది. పీటీడీ బస్సులకు అదనంగా అద్దె బస్సుల్లో కొన్నింటిని తీసుకొని వాటిని ప్రయాణికుల రవాణా సేవలకు వినియోగించాలని అధికారులు నిర్ణయించారు. డిసెంబరు 1 నుంచి వీటిని రోడ్డు మీదకు తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌కు పూర్వం రీజియన్‌లో 60 అద్దె బస్సులు మెట్రో,   ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులుగా నడిచేవి. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిలిపివేసిన వీటిలో తొలి విడతగా 20 బస్సులను నడపాలని విశాఖ రీజియన్‌ యాజమాన్యం నిర్ణయించింది. అనంతరం ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచనున్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలావుండగా విశాఖ రీజియన్‌లో ప్రస్తుతం పీటీడీకి చెందిన  460 సిటీ,  320 ఇతర బస్సులు తిరుగుతున్నాయి. ప్రతి డిపోలో ఆరు నుంచి ఎనిమిది వరకు స్పేర్‌ బస్సులు ఉన్నాయి. 


Updated Date - 2020-11-29T05:56:15+05:30 IST