Oct 19 2021 @ 00:56AM

సైకలాజికల్‌ థ్రిల్లర్‌

మరో బాలనటుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాల్లో బాల నటుడిగా నటించిన మహేంద్ర ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘అర్ధం’. శ్రద్ధా దాస్‌, అజయ్‌, ఆమని, సాహితీ అవంచ ఇతర ముఖ్య పాత్రధారులు. తెలుగు సహా తమిళ, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో   రూపుదిద్దుకున్న ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌కు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్‌ఎక్స్‌ నిపుణుడిగా పనిచేసిన మణికాంత్‌ తెల్లగూటి రచయిత, దర్శకుడు. రిత్విక్‌ వెత్సా సమర్పణలో రాధికా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను దర్శకుడు దేవ కట్టా  విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాఽధికా శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘చిత్రం షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. మణికాంత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. రాకేందు మౌళి మాటలు పాటలు రాశారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అని తెలిపారు. కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో చిత్రాన్ని  రూపొందించినట్టు దర్శకుడు మణికాంత్‌ తెలిపారు.  ఈ చిత్రానికి అసోసియేట్‌ నిర్మాతలు: పవన్‌ జానీ, వెంకట రమేశ్‌.