అనిల్, జాస్మిన్ జంటగా గోపాల్ రెడ్డి కాచిడిని దర్శకత్వంలో నూతన చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఎమ్ఎస్ ఆచార్య నిర్మాత. ముహూర్తపు సన్నివేశానికి సురేశ్ కొండేటి క్లాప్ కొట్టారు. హరి ప్రసాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘సైకో ఇత్తివృత్తంతో సాగే థ్రిల్లర్ చిత్రమిది’’ అన్నారు. ‘‘ఈ నెల 30న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఏకధాటిగా షూటింగ్ జరిపి సినిమాను పూర్తి చేస్తాం’’ అని నిర్మాత అన్నారు.