పెళ్లికి నిరాకరించిన మరదలిపై యాసిడ్ దాడి.. కోర్టు ఎలాంటి తీర్పునిచ్చిందంటే..

ABN , First Publish Date - 2022-04-19T06:25:52+05:30 IST

ఆ మహిళ ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.. ఆమె అత్త కొడుకు ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు.. పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతూ ఆమె వెంటపడేవాడు.. పెళ్లి చేసుకుందామని బలవంతం చేసేవాడు.. అతడిని పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి నిరాకరించింది.. దీంతో తీవ్ర ఆగ్రహానికి...

పెళ్లికి నిరాకరించిన మరదలిపై యాసిడ్ దాడి.. కోర్టు ఎలాంటి తీర్పునిచ్చిందంటే..

ఆ మహిళ ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది.. ఆమె బావ (అక్క భర్త) ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు.. పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతూ ఆమె వెంటపడేవాడు.. పెళ్లి చేసుకుందామని బలవంతం చేసేవాడు.. అతడిని పెళ్లి చేసుకునేందుకు ఆ యువతి నిరాకరించింది.. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి మరదలిపై యాసిడ్ పోసేశాడు. ఈ కేసును ఆరేళ్ల పాటు విచారణ చేసిన కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. 


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన బాధిత మహిళ ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఆమె బావ త్రిలోక్ పెళ్లి పేరుతో ఆమెను తరచుగా వేధించేవాడు. త్రిలోక్ బాధితురాలి అక్కను ఇంతకుముందు వివాహం చేసుకున్నాడు. కానీ భార్య మరణించడంతో మరదలిని పెళ్లిచేసుకోవానుకున్నాడు. త్రిలోక్‌ను పెళ్లి చేసుకునేందుకు బాధిత యువతి అంగీకరించలేదు. దీంతో 2016లో ఆమెపై త్రిలోక్ తన స్నేహితుడితో కలిసి యాసిడ్ దాడి చేశాడు. ఆ కారణంగా బాధిత యువతి మొహం తీవ్రంగా కాలిపోయింది. అనంతరం నిందితులు పరారయ్యారు. 


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం త్రిలోక్‌, అతని స్నేహితుడు శుభమ్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును ఆరేళ్ల పాటు విచారణ చేసిన జిల్లా కోర్టు తాజాగా తుది తీర్పు వెలువరించింది. నిందితులకు జీవితకాలం కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాదు ఇద్దరికీ మూడేసి లక్షల చొప్పున జరిమానా కూడా విధించింది.  


Updated Date - 2022-04-19T06:25:52+05:30 IST