Abn logo
Feb 24 2021 @ 17:18PM

పిఎస్‌పికె 27: మహాశివరాత్రికి ట్రీట్‌ ఫిక్సయింది

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రియేటివ్‌ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో.. డేరింగ్‌ ప్రొడ్యూసర్‌ ఏఎమ్‌ రత్నం రూపొందిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం పిఎస్‌పికె 27 ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'హరిహర వీరమల్లు' అనే టైటిల్‌ ఖరారు చేసినట్లుగా ఆంధ్రజ్యోతి ఎక్స్‌క్లూజివ్‌గా ప్రకటించింది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను చిత్రయూనిట్‌ అధికారికంగా విడుదల చేసేందుకు డేట్‌ ఫిక్స్‌ చేసింది. 

ప్రస్తుతం పిఎస్‌పికె 27 చిత్రంగా సెట్స్‌పై ఉన్న ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 11న విడుదల చేయబోతోన్నట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ అదరిపోయిందనే టాక్‌ వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్‌ వదులుతారా? అని ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మహాశివరాత్రికి అని టీమ్‌ అధికారికంగా చెప్పడంతో మెగాభిమానులు ట్రెండింగ్‌ కోసం ట్యాగ్‌లను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఔరంగజేబు కాలం నాటి కథతో క్రిష్‌ మ్యాజిక్‌ చేయబోతోన్న ఈ చిత్రానికి.. సంగీత దిగ్గజం ఎమ్‌. ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి మార్చి 11న ట్రీట్‌ ఫిక్సయింది కాబట్టి.. మెగాభిమానులు ట్రెండ్స్‌తో ఈ చిత్రాన్ని ఎక్కడ నిలబెడతారో వెయిట్‌ అండ్‌ సీ.. 

Advertisement
Advertisement
Advertisement