పీఎ‌స్ఎల్వీ విజయంలో హైదరాబాదీ సంస్థ

ABN , First Publish Date - 2022-02-15T07:12:56+05:30 IST

అంతరిక్ష పరిజ్ఞాన రంగంలోనూ హైదరాబాద్‌ సంస్థలు సత్తా చాటుతున్నాయి. సోమవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)....

పీఎ‌స్ఎల్వీ విజయంలో హైదరాబాదీ సంస్థ

 ‘అనంత్‌ టెక్నాలజీస్‌’ కీలక పాత్ర 

 వాహక నౌక, ఉపగ్రహాలకు 

 అవసరమైన పరికరాల సరఫరా


హైదరాబాద్‌, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : అంతరిక్ష పరిజ్ఞాన రంగంలోనూ హైదరాబాద్‌ సంస్థలు సత్తా చాటుతున్నాయి. సోమవారం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించిన పీఎ‌స్ఎల్వీ సీ-52 మిషన్‌ విజయంలోనూ హైదరాబాదీ సంస్థ అనంత్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ (ఏటీఎల్‌) పాలుపంచుకుంది. పీఎ్‌సఎల్‌వీ ప్రయోగ వాహక నౌకతో పాటు దాని ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలకు అవసరమైన పలు కీలక ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌ సబ్‌ సిస్టమ్స్‌ను ఈ కంపెనీ సరఫరా చేసింది. తిరువనంతపురం, బెంగళూరు నగరాల్లోని కంపెనీ యూనిట్ల ద్వారా ఏటీఎల్‌ ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని అనంత్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) సుబ్బారావు పావులూరి వెల్లడించారు. ‘‘మేము ఎప్పటి నుంచో ఇలాంటి విషయాల్లో ఇస్రోకు చెందిన విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ (వీఎ్‌సఎ్‌ససీ)తో కలిసి పని చేస్తున్నాంపీఎ‌స్ఎల్వీ సీ-52 మిషన్‌ వినూత్నమైంది. ఈ ప్రయోగ వాహక నౌక అనుసంధానం, పరీక్షలు, ప్రయోగానికి సిద్ధం చేయడంలో మా కంపెనీ పాల్గొంది. వీఎ్‌సఎ్‌ససీ ఇంజనీర్ల మార్గదర్శకత్వంలో మేం ఈ పని పూర్తి చేశాం’’ అని సుబ్బారావు పావులూరి తెలిపారు. 


30 ఏళ్ల అనుబంధం..

ఏటీఎల్‌ గత మూడు దశాబ్దాలుగా ఇస్రోతో కలిసి పని చేస్తోంది. ఈ 30 ఏళ్లలో ఇస్రో ప్రయోగించిన 69 ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలు, 89 ఉపగ్రహాలకు అవసరమైన కీలక ఎలకా్ట్రనిక్స్‌, మెకానికల్‌ సబ్‌ సిస్టమ్స్‌ను ఎలాంటి చిన్న లోపం (జీరో డిఫెక్ట్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌) లేకుండా ఏటీఎల్‌ సరఫరా చేసింది. సోమవారం ప్రయోగించిన పీఎ్‌సఎల్‌వీ సీ-52 రాకెట్‌ ఫ్యాబ్రికేషన్‌, అసెంబ్లీ, టెస్టింగ్‌, ఆన్‌బోర్డ్‌ కంప్యూటర్స్‌, కంట్రోల్‌ ఎలకా్ట్రనిక్స్‌, టెలిమెట్రీ, పవర్‌ సిస్టమ్స్‌ సరఫరా వంటి కీలక పనులు ఏటీఎల్‌ తిరువనంతపురం యూనిట్‌ పూర్తి చేసింది. ఇక ఈ రాకెట్‌ ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాలకు అవసరమైన కొన్ని కీలక పరికరాలను ఏటీఎల్‌ బెంగళూరు యూనిట్‌ సరఫరా చేసింది.

Updated Date - 2022-02-15T07:12:56+05:30 IST