పీఎస్‌జీ మేనేజర్ పొచెట్టినోకు కొవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2021-01-16T14:20:08+05:30 IST

పారిస్ సెయింట్-జర్మన్ (పిఎస్‌జి) కోచ్ మారిసియో పోచెట్టినోకు జరిపిన పరీక్షల్లో కొవిడ్ -19 పాజిటివ్ అని తేలినట్లు...

పీఎస్‌జీ మేనేజర్ పొచెట్టినోకు కొవిడ్ పాజిటివ్

పారిస్: పారిస్ సెయింట్-జర్మన్ (పిఎస్‌జి) కోచ్ మారిసియో పోచెట్టినోకు జరిపిన పరీక్షల్లో కొవిడ్ -19  పాజిటివ్ అని  తేలినట్లు ఫ్రెంచ్ ఛాంపియన్స్ చెప్పారు. 48 ఏళ్ల కోచ్ అయిన పోచెట్టినోను కొవిడ్  మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్ కు తరలించారు. పొచెట్టినో సహాయకులు జీసస్ పెరెజ్, మిగ్యుల్ డి అగోస్టినో శనివారం జట్టు బాధ్యతలు స్వీకరిస్తారు.గతవారంలో పీఎస్జీ ఆటగాళ్లు  బ్రెజిలియన్ రఫిన్హా, జర్మన్ ఆటగాడు తిలో కెహ్రేర్, ఫ్రెంచ్ యువ అంతర్జాతీయ కోలిన్ దగ్బాలకు కరోనా పాజిటివ్ అని తేలింది. టోటెన్హామ్ పోచెట్టినో ఇప్పటివరకు మూడు పీఎస్జీ ఆటలు పర్యవేక్షించారు.పొచెట్టినో 2001 నుంచి 2003 వరకు పీఎస్‌జీ కోసం ఆడారు. 

Updated Date - 2021-01-16T14:20:08+05:30 IST