Abn logo
Aug 4 2021 @ 01:00AM

ఎంపీపీ స్కూల్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలి

పాఠశాల ముఖద్వారం

గ్రామస్థుల వినతి

బడేవారిపాలెం (వలేటివారిపాలెం) ఆగస్టు 3 : నూతన విద్యా విధానంలో భాగంగా మండలంలోని బడేవారిపాలెం ఎంపీపీ స్కూల్‌ను ఎంపీయూపీ స్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. బడేవారిపాలెం స్కూల్‌ గతంలో ఎంపీయూపీ స్కూల్‌గా ఉండేదన్నారు. అయితే మధ్యలో విద్యార్థుల హాజరుశాతం తగ్గడంతో ఎంపీపీ స్కూల్‌గా మార్చారని తెలిపారు. ఈ పాఠశాలలో గతంలో చదివిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ పాఠశాలకు విశాలమైన ఆటస్థలం, భవన వసతులు ఉన్నాయన్నారు. ఈ పాఠశాలకు రెండు కిలోమీటర్లు దూరంలో నేకునాంపురం, నూకవరం, బొంతవారిపాలెం గ్రామాల్లోని ప్రాథమిక విద్యను బడేవారిపాలెం స్పెషల్‌ స్కూల్‌కు విలీనం చేయాలని పాలకులను, అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.