ప్రై డే

ABN , First Publish Date - 2022-04-30T06:34:38+05:30 IST

జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం తో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగల కు పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. గాలిలో ఆర్ధత భావం పెరిగిపోయి తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. జిల్లాలో శుక్రవారం గరిష్ఠ పగటి

ప్రై డే
ఎండతీవ్రతకు నిర్మానుష్యంగా మారిన కలెక్టర్‌ చౌక్‌

జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

45 డిగ్రీలకు చేరువలో పగటి ఉష్ణోగ్రతలు

పగలంతా భగభగ.. రాత్రంతా ఉక్కపోత

మరికొద్ది రోజుల పాటు వడగాలుల ప్రభావం

హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ 

ఆందోళన రేకెత్తిస్తున్న ఐఎండీ నివేదికలు

ఆదిలాబాద్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత రెండు రోజులుగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదు కావడం తో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉదయం నుంచే భానుడి భగభగల కు పగటి ఉష్ణోగ్రతలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. గాలిలో ఆర్ధత భావం పెరిగిపోయి తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. జిల్లాలో శుక్రవారం గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు 44.0 డిగ్రీల కాగా, కని ష్ఠ ఉష్ణోగ్రతలు 27.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. గతేడు జిల్లాలో అత్యధి కంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇప్పటికే ఈ యేడు 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణో గ్రతల ప్రభావం మరింత ఎక్కువగానే ఉంటుందని భారతీయ వాతావర ణ పరిశీలన విభాగం (ఐఎండీ) అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మండుతున్న ఎండల ధాటికి చిరు వ్యాపారులు, రైతు, ఉపాధి కూలీలు అల్లాడుతున్నారు. ఇప్పటికే వడదెబ్బ బారీనపడి జిల్లాలో ముగ్గురు కూలీలు మృతి ఆందోళన రేపుతోంది. మధ్యాహ్న సమయంలో కొందరు మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు గొడుగు సహా యంతోనే బ యటకు వెళ్లాల్సి వస్తుంది. అయితే వేసవి పరిస్థితుల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తుండగా.. నోరులేని మూగజీవాలు పచ్చని చెట్ల కింద సేద తీరుతున్నాయి. అప్రమత్తంగా ఉంటేనే ఆపదలూ దూరమవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు.

జిల్లాలో ఆరెంజ్‌ అలర్ట్‌

జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో భారతీయ వాతావరణ పరిశీలన విభాగం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉష్ణోగ్రత ల తీవ్రతను తెలుపడానికి వాతావరణ శాఖ నాలుగు రకాల అలర్ట్‌ను ప్ర కటిస్తుంది. ఇందులో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైతే గ్రీన్‌ అలర్ట్‌, ఓ మోస్తారుగా ఉష్ణోగ్రతలు నమోదైతే ఎల్లో అలర్ట్‌, 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదయితే ఆరెంజ్‌ అలర్ట్‌గా ప్రక టించి ఎట్టిపరిస్థితిలో ఎండలో తిరుగరాదంటూ హెచ్చరికలు జారీ చేస్తా రు. అదే 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీలు.. ఆపై ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్‌ అలర్ట్‌గా ప్రకటించి ప్రమాదపు హెచ్చరికలు జారీ చేస్తా రు. గత రెండు మూడు రోజులుగా 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి.  ప్రస్తుతం జిల్లాలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించేందుకు వాతావరణ శాఖ సిద్ధమవుతోంది. ఇదే జరిగితే సంబంధిత రెవెన్యూ, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుం దని పేర్కొంటున్నారు. 

వేడిగాలుల ప్రభావం

ఈయేడు మార్చి 2వ వారం నుంచే ఉష్ణోగ్రత పెరుగుదల కనిపించిం ది. ఆ తర్వాత జిల్లాలో ఈదురు గాలులతో వాతవరణం ఒక్కసారిగా చల్లబడింది. తిరిగి ఏప్రిల్‌ 25 నుంచి 29వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు జిల్లాపై వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది. గడిచిన వారం రోజుల్లోనే వడదెబ్బ బారీనపడి ముగ్గురు కూలీ లు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురి కావడం చూస్తుంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. వేసవిలో 40డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాలుల ప్రభావం ఉందని చెప్పొచ్చు. అదే 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్రమైన వడగాలుల ప్రభావం ఉటుందని పేర్కొంటారు. జిల్లాపై మరో రెండు, మూడు రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే నెలలో విపరీతమైన ఎండల ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. గాలిలో తేమ పడిపోవడంతో వడగాలుల ప్రభావం మరింత పెరుగుతోంది.

‘పవర్‌’ ఫుల్‌ యూజ్‌

గత పక్షం రోజులుగా పెరిగి పోతున్న ఉష్ణోగ్రతలకు విద్యుత్‌ వినియోగం కూడా భారీగా పెరిగిపోతోంది. దీంతో అధికారులు అప్రకటిత విద్యుత్‌ కోతలను విధి స్తున్నారు. మండుతున్న ఎండలకు విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు మొరాయించడంతో వ్యవసాయంతో పాటు గృహ వినియోగం సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాకు కేటాయించిన విద్యుత్‌ వినియోగం కంటే అదికంగానే ఉంటుందని అధి కారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో అప్రకటిత కరెంట్‌ కోతల కారణంగా ఉక్కపోత భరించలేక జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. ఆసుపత్రుల్లో కూడా రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెరిగి పోతున్న ఉష్ణోగ్రతల కారణంగానే విద్యుత్‌ సరఫరాలో కొంత అంతరా యం ఏర్పడుతోందని అధికారులు చెప్పుకొస్తున్నారు. అయితే మరమ్మతుల పేరిట అడ్డగోలుగా విద్యుత్‌ సరఫరాను నిలిపి వేస్తున్నారు. గృహా వినియోగానికి కొంతమెరుగ్గానే కనిపిస్తున్నా.. వ్యవసాయానికి మాత్రం కోతలు పెడుతున్నారు. 24 గంటల విద్యుత్‌ సరఫరాకు బదులు 12 గంటలు మాత్రమే కేటాయిస్తున్నారు.

ఏప్రిల్‌ 23 నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతలిలా..             

   రోజు                గరిష్ఠం       కనిష్ఠం

ఏప్రిల్‌ 23           37.8     28.4

ఏప్రిల్‌ 24           41.8    23.6

ఏప్రిల్‌ 25           39.0    22.6

ఏప్రిల్‌ 26           43.3    27.2

ఏప్రిల్‌ 27           43.5    25.4

ఏప్రిల్‌ 28           44.3    26.4

ఏప్రిల్‌ 29           44.0    27.4

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

: శ్రీధర్‌చౌహాన్‌, సీనియర్‌ శాస్త్రవేత్త, ఆదిలాబాద్‌

జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అత్యవసరమైతేనే ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లరాదు. మరో రెండు, మూడు రోజుల పాటు జిల్లాపై వడగాలుల ప్రభావం ఉంటుంది. రైతులు, కూలీలు మధ్యాహ్నం సమయంలో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వేసవి ఆపదల నుంచి దూరం కావొచ్చు. ఈ యేడు రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు ఉన్నాయి.

Updated Date - 2022-04-30T06:34:38+05:30 IST