కరోనా కట్టడి కోసం మన దేశంలో లాక్‌డౌన్‌ను విధించారు. ఆ సమయంలో ‘ఆడు జీవితం’ షూటింగ్ నిమిత్తం హీరో పృథ్వీరాజ్ సహా 58 మంది చిత్ర యూనిట్ సభ్యులు జోర్డాన్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. లాక్డౌన్ క్రమంగా పొడిగిస్తూ వచ్చారు. ఈ కారణంగా చిత్ర యూనిట్ దాదాపు రెండు నెలల పాటు జోర్డాన్‌లో ఉండిపోయారు. ఆ సమయంలో హీరో పృథ్వీరాజ్ తన ట్విట్టర్ ద్వారా తాము జోర్డాన్‌లో ఎదుర్కొంటోన్న సమస్యలను తెలియజేశారు. తమ యూనిట్‌ను ఇండియాకు రప్పించాలని కేరళ సీఎం, ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ కూడా రాశారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించడంతో పృథ్వీరాజ్ సహా చిత్ర యూనిట్ ప్రత్యేక ఎయిరిండియా విమానంలో ఇండియా చేరుకున్నారు. దీంతో అభిమానులు, కుటుంబ సభ్యులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.