APలో రెచ్చిపోతున్న YCP నేతలు

ABN , First Publish Date - 2022-05-31T17:17:55+05:30 IST

APలో మూడేళ్లుగా అధికారపార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా పాలన సాగుతోంది.

APలో రెచ్చిపోతున్న YCP నేతలు

Amaravathi: APలో మూడేళ్లుగా అధికారపార్టీ నేతలు ఆడిందే ఆట.. పాడిందే పాటగా పాలన సాగుతోంది. కేసులు పెట్టి విపక్ష నేతలు, కార్యకర్తలను హడలుకొడుతున్న అధికారపార్టీ నాయకులు ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో పైచేయి సాధించారు. ప్రధాన ప్రతిపక్షం సహా విపక్షాలను అణగదొక్కారు. గ్రామంలో వైసీపీ (YCP) ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పోలీసుల అండతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ వైసీపీ ప్రజా ప్రతినిధులు విపక్ష కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. 


మహానాడు (Mahanadu)లో సీఎం జగన్‌ (Jagan)పై అనవసర విమర్శలు చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గురించి ఎక్కవగా మాట్లాడితే అచ్చెన్నాయుడు తాట తీస్తానన్నారు. ఓ అడుగు ముందుకేసి జగన్ కోసం ప్రాణాలు అర్పించేందుకు ఆత్మాహుతి దళం సభ్యుడిగా మారేందుకైనా తాను సిద్ధమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో వైసీపీ ప్రజా ప్రతినిధులు చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇటీవల ఎమ్మెల్సీ అనంతబాబు (Anantababu) తన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి కారులో మృత దేహాన్ని అతని ఇంటికే పంపించాడు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చివరకు విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో పోలీసులు అనంతబాబును అరెస్టు చేశారు. లేకపోతే అధికార బలంతో ఆయన కేసు నుంచి బయటపడేవాడు. ప్రతి జిల్లాలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో దురాగతాలు సాగిస్తున్నారు. వైసీపీ రాజకీయ పార్టీగా కాకుండా మిలిటెంట్ గ్రూప్‌గా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. జగన్ పాలనను విమర్శిస్తే తట్టుకోలేని వైసీపీ నేతలు చంపుతాం, పొడుస్తాం, ఆత్మాహుతి దళంగా మారతామంటూ మిలిటెంట్ తరహా భాషను ప్రయోగిస్తున్నారు. పోలీసుల అండతో రెచ్చిపోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైసీపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని విపక్ష నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-05-31T17:17:55+05:30 IST