రెచ్చిపోయిన దొంగలు

ABN , First Publish Date - 2020-12-06T05:19:13+05:30 IST

జి.సిగడాం, రణస్థలం మండలాల్లో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు మూడు గ్రామాల్లో చోరీకి తెగబడ్డారు. 23 తులాల బంగా రు ఆభరణాలు, లక్ష రూపాయల నగదును అపహరించారు.

రెచ్చిపోయిన దొంగలు

మూడు గ్రామాల్లో చోరీలు

23 తులాల బంగారం అపహరణ

లక్ష రూపాయల నగదు కూడా..

జి.సిగడాం/రణస్థలం, డిసెంబరు 5 : జి.సిగడాం, రణస్థలం మండలాల్లో దొంగలు రెచ్చిపోయారు. ఒకే రోజు మూడు గ్రామాల్లో చోరీకి తెగబడ్డారు. 23 తులాల బంగా రు ఆభరణాలు, లక్ష రూపాయల నగదును అపహరించారు. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఉదయం జి.సిగడాం మండలం వాండ్రంగి గ్రామానికి చెందిన గేదెల లచ్చన్న ఇంటి తలుపులు పగులగొట్టి దొంగలు లోపలకు చొరబడ్డారు. బీరువా తాళాలు విరగొట్టి 19 తులాల బంగారు ఆభరణాలు, రూ.15వేల నగదు అపహరించారు.  అదే విధంగా ఇదే మండలం డీఆర్‌వలసకు చెందిన గవర నారాయ ణరావు ఇంట్లో కూడా చోరీ జరిగింది. నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ.20వేల నగదును దొంగిలిం చారు. ఈ సమయంలో బాధితులు పొలం పనులు ఉన్నా రు. వారు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి దొంగతనం విషయం వెలుగుజూసింది. దీనిపై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు.  శ్రీకాకుళం క్రైం ఏఎస్పీ విఠలాచార్య, రాజాం సీఐ నవీన్‌కుమార్‌, ఎస్‌ఐ ఎండీ అహ్మద్‌ ఆజాద్‌లు సంఘటనా స్థలాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ రణస్థలం  మండలం  లంకపేట గ్రామానికి చెందిన ఎస్‌.శ్రీను ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు రూ.65వేలు చోరీ చేసినట్లు జేఆర్‌పురం పోలీసులకు శనివారం ఫిర్యాదు అందింది.  పెట్టెలో రూ.1.55లక్షలు పెట్టగా  రూ.90 వేలు మాత్రమే ఉందని, మిగతా డబ్బులు లేవని శ్రీను పోలీసులకు తెలిపాడు.  ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-12-06T05:19:13+05:30 IST