Advertisement
Advertisement
Abn logo
Advertisement

16 గ్రామాలకు తాత్కాలిక రోడ్డు ఏర్పాటు

జమ్మలమడుగు రూరల్‌, డిసెంబరు 5: భారీ వర్షాలకు పెన్నానదిలో వరద ప్రవాహంతో జమ్మలమడుగు-ముద్దనూరు వెళ్లే రోడ్డులో వంతెన కూలిపో యి రాకపోకలు నిలిచిపోయిన సుమారు 16 గ్రామాలకు తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు. మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి వరద నీరు నిలుపుదల చేయడంతో జమ్మలమడుగు వద్ద పెన్నాలో నీటి ప్రవా హం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలకు రాకపోకల కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాత్కాలికంగా జాతీయ రహదా రుల సంస్థ(ఎన్‌హెచ్‌) అధికారులు నదిలో సిమెంటు పెపులు ఏర్పాటు చేసి వంతెన  పనులు పూర్తయ్యే వరకు రాకపోకల పునరుద్ధరణకు చర్య లు చేపట్టారు.  జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్డులో బ్రిటీష్‌ కాలం నాటి రోడ్డు నది ప్రవాహంతో బాగా దెబ్బతింది. అయితే వంతెన ఉండడంతో వాహనాలు ఈ రోడ్డుపై నడవక రోడ్డు విషయమే మరుగునపడిపోయింది. అయితే భారీ వర్షాలకు పెన్నా ఉధృతంగా ప్రవహించడం వంతెన ఒక ఫిల్లర్‌ కిందకు కుంగిపోవడంతో 16 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారి మార్గంలేక ప్రజలు చుట్టూ తిరిగి ఎక్కువ దూరం ప్రయాణించి అవస్థలు పడ్డారు. కూలిపనులు చేసుకునే కూలీలు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, వ్యాపారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఇటీవల వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి శనివారం నుంచి నీరు నిలుపుదల చేశారు. దీంతో ప్రజలు నదిలో నీరులేకపోవడంతో నడిచి వెళుతున్నారు. ఇదిలా ఉండగా పెన్నాలో సుమారు రెండు నుంచి మూడు చోట్ల వరద ధాటికి రోడ్డు కొట్టుకుని పోవడం వలన స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి జిల్లా అధికారులకు సమస్యను తెలియజేశారు. వెంటనే ఆదివారం ఉదయం నుంచి ఎన్‌హెచ్‌పీఆర్‌ కన్‌స్ట్రక్షన్‌వారు  రోడ్డు పనులు ప్రారంభించారు. పెన్నానదిలోనే ఒకవైపు పనులు చేస్తున్నా ప్రజలు నడిచి వెళుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వంతెన సమీపాన 150 రింగ్‌పైపులు చేర్చారు. రెండు ఎక్స్‌కవేటర్లు, హిటాచీలతో పనులు చేస్తున్నారు. కాగా రెండు రోజుల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత ఎన్‌హెచ్‌ ఏఈ సుబ్బ య్య, సూపర్‌వైజరు చెన్నకృష్ణారెడ్డిలు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు.

Advertisement
Advertisement