వివిధ ఆస్పత్రులు, జైళ్లకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల అందజేత

ABN , First Publish Date - 2021-10-20T05:21:27+05:30 IST

కొవిడ్‌ సమయంలో ఆస్పత్రుల్లో రోగులకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఎంతో ఉపయోగపడతాయని హెచ్‌పీసీఎల్‌ హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ పుష్పకుమార్‌ జోషి అన్నారు.

వివిధ ఆస్పత్రులు, జైళ్లకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల అందజేత
విశాఖ కేంద్ర కారాగారం సూపరింటిండెంట్‌ రాహుల్‌కు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందజేస్తున్న పుష్పకుమార్‌ జోషి

ఆరిలోవ, అక్టోబరు 19: కొవిడ్‌ సమయంలో ఆస్పత్రుల్లో రోగులకు ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు ఎంతో ఉపయోగపడతాయని హెచ్‌పీసీఎల్‌ హెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ పుష్పకుమార్‌ జోషి అన్నారు. దీనదయాల్‌పు రంలోని స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌ సమావేశ మందిరంలో ఆజాదీకా అమృత్‌ ఉత్సవ్‌లో భాగంగా మంగళవారం ఉదయం వివిధ ఆస్పత్రులు, జైళ్లకు ఆయన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందజేశారు. కేజీహెచ్‌, జీవీఎంసీ, రైల్వే ఆస్పత్రి, క్వీన్‌ విక్టోరియా ఆస్పత్రి, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, గోపాలపట్నం ప్రభుత్వ వైద్యశాల, విశాఖ, విజయనగరం, రాజమండ్రి, కడప సెంట్రల్‌ జైళ్లకు మొత్తం 72 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్‌ జీఎం కె.నగేశ్‌, ఎల్‌పీజీ జోన్‌ జీఎం అవినాష్‌ జైన్‌, కేజీహెచ్‌ సూపరింటిండెంట్‌ కె.మైఽథిలి, డాక్టర్‌ సుధాకర్‌, సెంట్రల్‌ జైలు సూపరింటిండెంట్‌ ఎస్‌.రాహుల్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T05:21:27+05:30 IST