Employees Provident Fundపై వడ్డీ రేట్లు తగ్గించిన కేంద్రం

ABN , First Publish Date - 2022-06-04T01:42:05+05:30 IST

న్యూఢిల్లీ: పీఎఫ్‌పై కేంద్రం వడ్డీ రేట్లు తగ్గించింది. 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Employees Provident Fundపై వడ్డీ రేట్లు తగ్గించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధిపై కేంద్రం వడ్డీ రేట్లు తగ్గించింది. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నాలుగు దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ వడ్డీరేటు. 1977-78లో పీఎఫ్ వడ్డీరేటు 8 శాతంగా ఉండేది. కేంద్రం నిర్ణయం కారణంగా 5 కోట్ల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది.  


కేంద్రం నిన్ననే వంట గ్యాస్‌ (ఎల్పీజీ) సిలిండర్లపై ఇస్తున్న రాయితీని ఎత్తేసింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న పేదలకు మాత్రమే సిలిండర్లపై రాయితీ ఇవ్వనుంది. ఉజ్వల లబ్ధిదారులకు రూ.200 సబ్సిడీ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై రూ.6100 కోట్ల భారం పడనుంది. ఈ పథకం కింద ఏడాదిలో 12 సిలిండర్లకు రూ.200 చొప్పున సబ్సిడీ దక్కనుంది. దేశవ్యాప్తంగా 30.50 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా.. ఇందులో 9 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులున్నారు. 

Updated Date - 2022-06-04T01:42:05+05:30 IST