పథకాలు సక్రమంగా అందజేయండి

ABN , First Publish Date - 2020-11-25T05:18:00+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందజేయాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌ కోరారు. మంగళవారం కంచిలి ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాలను సందర్శించి పథకాలు అమలు తీరుపై సమీక్షించారు.

పథకాలు సక్రమంగా అందజేయండి
కంచిలిలో ఎంపీడీవోతో మాట్లాడుతున్న సాయిరాజ్‌

 

డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌

కంచిలి: రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందజేయాలని డీసీఎంఎస్‌ చైర్మన్‌ పిరియా సాయిరాజ్‌ కోరారు. మంగళవారం కంచిలి ఎంపీడీవో, తహసీల్దార్‌ కార్యాలయాలను సందర్శించి పథకాలు అమలు తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా   జగనన్న తోడు పథకం కింద 600 మందిని గుర్తించగా బ్యాంకర్లు 90 మందికి మాత్రమే రుణాలు అందించనున్నారని ఎంపీడీవో ఆర్‌.వెంకటరావు తెలిపారు. మిగిలిన వారి విషయాన్ని కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని సాయిరాజ్‌ తెలిపారు. మండలంలో జరిగే చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో తనపేరు ఉపయోగిస్తే తనకు సంబంధం లేదని గ్రహించాలని ఇన్‌చార్జి తహసీల్దార్‌ ఆర్‌.వెంకటేష్‌కు తెలిపారు. ఇళ్లపట్టాల పంపిణీపై అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలకు తావు లేకుండా  చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్‌ ఎం.మంజు, నాయకులు  పి.దేవదాసురెడ్డి, ఇప్పిలి కృష్ణారావు, లడ్డుకేశవపాత్రో, పి.జయరాం, డి.బలరాం, దాలయ్య ఉన్నారు.ఫసోంపేట : సోంపేటలో నటరాజ నాట్య మండలి  కళాక్షేత్రాన్ని డీసీఎంఎస్‌ చైర్మన్‌  సాయిరాజ్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు ప్రదర్శన పత్రాలను నాట్యమండలి సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ మంజు, వైసీపీ నాయకులు తడక జోగారావు, పైల దేవదాస్‌ రెడ్డి పాల్గొన్నారు.

 

Updated Date - 2020-11-25T05:18:00+05:30 IST