బ్రిటన్‌లో భారతీయులకు రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2022-09-23T07:42:09+05:30 IST

బ్రిటన్‌లో భారతీయుల భద్రత, సంక్షేమంపై విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఐక్యరాజ్యసమితి

బ్రిటన్‌లో భారతీయులకు రక్షణ కల్పించండి

న్యూయార్క్‌, సెప్టెంబరు 22: బ్రిటన్‌లో భారతీయుల భద్రత, సంక్షేమంపై విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో పాల్గొన్న ఆయన బ్రిటన్‌ విదేశాంగమంత్రి జేమ్స్‌ క్లెవర్లీతో సమావేశమయ్యారు. ఇరుదేశాల సంబంధాలు బలోపేతం దిశగా క్లెవర్లీ నిబద్ధతను జైశంకర్‌ కొనియాడారు. బొలీవియా,  నార్వే, ఎస్టోనియా విదేశాంగమంత్రులతోనూ జైశంకర్‌ చర్చలు జరిపారు.

Updated Date - 2022-09-23T07:42:09+05:30 IST