పౌష్టికాహారం సక్రమంగా అందించండి : కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-13T05:19:10+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రా ల్లో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణు లకు అందజేస్తున్న కోడిగుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా పంపిణీ చేయా లని జిల్లా కలెక్టర్‌ పిఎస్‌ గిరీషా ఆదే శించారు.

పౌష్టికాహారం సక్రమంగా అందించండి : కలెక్టర్‌
సచివాలయ ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తున్న కలెక్టర్‌ గిరీషా

కలికిరి, ఆగస్టు 12: అంగన్‌వాడీ కేంద్రా ల్లో చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణు లకు అందజేస్తున్న కోడిగుడ్లు, పాలు, బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా పంపిణీ చేయా లని జిల్లా కలెక్టర్‌ పిఎస్‌ గిరీషా ఆదే శించారు. పౌష్టికాహార పంపిణీని ఏఎన్‌ఎంతోపాటు మహిళా పోలీసు లు పర్యవేక్షించాలని చెప్పారు. శుక్రవారం ఆయన మండలంలోని గుండ్లూరు, మహల్‌ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సచివాలయ ఉద్యోగుల రిజిస్టర్లను పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల బయోమెట్రిక్‌ హాజరు 90 శాతం తగ్గకుండా ఎంపీడీవోలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా గ్రామ వలంటీర్లు వారంలో మూడు రోజులు తప్పనిసరిగా సచివాలయాల్లో హాజరు వేసుకోవాలని స్పష్టం చేశారు. మహల్‌ సచివాలయం పరిధిలో జరుగుతున్న ఆర్బీకే, డిజిటల్‌ లైబ్రరీ నిర్మాణాలను కలెక్టరు పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దారు భాగ్యలత, ఈవోఆర్డీ అబ్దుల్‌ కలామ్‌ అజాద్‌, కార్యదర్శి రెడ్డిప్రసాద్‌, వీఆర్వో చంద్రయ్య, సచివాలయ సిబ్బంది వున్నారు. 


Updated Date - 2022-08-13T05:19:10+05:30 IST