అధికారిక సమాచారాన్నే ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-04-02T06:40:12+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తిపై సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా సహా అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ అధికారిక సమాచారా న్నే ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ధ్రువీకరించుకోకుండా ఇచ్చే వార్తలతో ప్రజలు

అధికారిక సమాచారాన్నే ఇవ్వాలి

  • ఆర్థిక ఎమర్జెన్సీపై 2 వారాల తర్వాత: సుప్రీం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: కరోనా వైరస్‌ వ్యాప్తిపై సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియా సహా అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ అధికారిక సమాచారా న్నే ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ధ్రువీకరించుకోకుండా ఇచ్చే వార్తలతో ప్రజలు భయపడే ప్రమాదం ఉంటుందని పేర్కొంది. కరోనా వైర్‌సపై కేంద్రం సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. ఈ ఆదేశాల ను జాతీయ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌(ఎన్‌బీఏ) స్వాగతించింది. ఈ అంశంపై ప్రభుత్వమే రోజువారీ వివరాలను సోషల్‌ మీడియా సహా అన్ని మీడియా వేదికలకు విడుదల చేయాలని ఎన్‌బీఏ అధ్యక్షుడు రజత్‌శర్మ కోరారు. కాగా.. ఇరాన్‌లోని కోమ్‌లో 250 మంది భారత యాత్రికులు చిక్కుకున్నారని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.


వారందరికీ కరోనా పరీక్షలు జరపగా పాజిటివ్‌ వచ్చిందని పేర్కొంది. మరో 500 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు వివరించింది. అయితే అక్కడ చిక్కుకున్న వారి బాధ్యతను భారత దౌత్యకార్యాలయం తీసుకోవాలని ఆదేశించనున్నట్లు న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్‌, ఎంఆర్‌ షాల ధర్మాసనం తెలిపింది. అంతర్జాతీయ విమానాలు రద్దయినందున, వారిని తీసుకొచ్చేందుకు విదేశాంగ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. మరోవైపు దేశంలో ఆర్థిక ఎమర్జెన్పీ విధించాల ంటూ దాఖలైన  పిటిషన్‌పై విచారణను 2 వారాల తరువాత చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైందని, అందుకే ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలంటూ సెంటర్‌ ఫర్‌ అకౌంటబిలిటీ, సిస్టమ్‌ చేంచ్‌ (సీఏఎ్‌ససీ) ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. 

Updated Date - 2020-04-02T06:40:12+05:30 IST