అర్హులకు రుణాలు అందించాలి

ABN , First Publish Date - 2020-08-08T05:38:51+05:30 IST

అర్హులందరికీ ఆత్మ నిర్బర్‌ భారత్‌ పథకం ద్వారా రుణాలు అందించాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సూచించారు.

అర్హులకు రుణాలు అందించాలి

మేడ్చల్‌ అర్బన్‌/ మేడ్చల్‌ : అర్హులందరికీ ఆత్మ నిర్బర్‌ భారత్‌ పథకం ద్వారా రుణాలు అందించాలని కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుంచి మున్సిపల్‌ కమిషనర్లతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా చూడాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌లు, వైస్‌ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల సహకారంతో రెండు రోజుల్లో లబ్ధిదారులకు రుణాలు అందించాలన్నారు. అలాగే వంద శాతం పన్ను వసూళ్లను చేపట్టాలన్నారు. జిల్లాలో 29 అర్బన్‌ ట్రీ పార్కులు గుర్తించామని, కలిసికట్టుగా వాటిని అభివృద్ధి చేయాలన్నారు. దుండిగల్‌, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల్లో రోడ్ల పక్కన పెరిగిన గడ్డిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.


కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌ పాల్గొన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో యాదాద్రి తరహాలో ప్లాంటేషన్‌ చేపట్టనున్నట్లు కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధి 4వ వార్డులో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌ హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ మద్దుల లక్ష్మీశ్రీనివా్‌సరెడ్డి, వైస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, కమిషనర్‌ అమరేందర్‌రెడ్డి, సరస్వతీ మోహన్‌రెడ్డి, హేమంత్‌రెడ్డి, హంసరాణికృష్ణగౌడ్‌, జైపాల్‌రెడ్డి, బాలరాజు, వీణాసురేందర్‌గౌడ్‌, దొడ్ల మల్లిఖార్జున్‌ముదిరాజ్‌, కందాడి నరేందర్‌రెడ్డి, మద్దుల శ్రీనివా్‌సరెడ్డి, డీఈ చిరంజీవులు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-08T05:38:51+05:30 IST