పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎదుగుదల ఉండదు: ‘క్రియా’ స్నాతకోత్సవంలో రఘురామ్ రాజన్

ABN , First Publish Date - 2022-07-05T01:01:09+05:30 IST

నగరంలోని సర్ ముత్తా వెంకటసుబ్బారావు కాన్సర్ట్ హాల్ (ఆండాళ్ స్కూల్)లో క్రియా

పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎదుగుదల ఉండదు: ‘క్రియా’ స్నాతకోత్సవంలో రఘురామ్ రాజన్

చెన్నై: నగరంలోని సర్ ముత్తా వెంకటసుబ్బారావు కాన్సర్ట్ హాల్ (ఆండాళ్ స్కూల్)లో క్రియా యూనివర్సిటీ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.  2020, 2021 ఎంబీయే విద్యార్థులు, 2022 పీహెచ్‌డీ, ఎంబీయే, యూజీ విద్యార్థులకు నిర్వహించిన ఈ కాన్వొకేషన్ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. కరోనా నేపథ్యంలో దేశంలోని ప్రముఖ స్టెమ్ ఇంజినీరింగ్ అండ్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సంస్థ అయిన ఫోర్బ్స్ మార్షల్ కో చైర్మన్  డాక్టర్ నౌషాద్ ఫోర్బ్స్, బహుముఖ విద్వాంసుడు ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గౌరవ అతిథులుగా వర్చువల్‌గా ఈ వేడుకలో పాల్గొన్నారు. భారతీ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ డాక్టర్ రఘురామ్ రాజన్ అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి విద్యార్థులను ఆశ్చర్యపరిచారు. 


ఛాన్స్‌లర్ ఎన్.వఘుల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కపిల్ విశ్వనాథన్, వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఎస్.శివకుమార్, ప్రొఫెషనల్ లెర్నింగ్ ప్రో వైస్ ఛాన్స్‌లర్ రామ్‌కుమార్ రామమూర్తి, ప్రారంభ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ సుందర్ రామస్వామి, డివిజనల్ చైర్మన్, అధ్యాపకులు, క్రియా కమ్యూనిటీలోని ఇతర సభ్యుల సమక్షంలో గ్రాడ్యుయేట్లకు పట్టాలను ప్రదానం చేశారు. 


ఈ సందర్భంగా డాక్టర్ నౌషాద్ ఫోర్బ్స్ పూణెలోని తన నివాసం నుంచి జూమ్ ద్వారా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సవాళ్లను ఎదుర్కొనే నాయకత్వాన్ని అందించడంలో ఆదర్శంగా నిలిచారని  కొనియాడారు. చేయడానికి చాలా ఉందని, ప్రతి చోటా అవసరం ఉందని అన్నారు. అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు.


అనంతరం డాక్టర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ.. ఎవరికి వారే సవాళ్లు విసురుకోవాలన్నారు. పరిస్థితులు సులభంగా ఉంటే ఎదుగుదల ఉండదన్నారు. మీరెవరో మీకు నిజంగా తెలియదని, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం ద్వారా కనుగొనాలని సూచించారు. తిరిగి ఇవ్వడం అనేది ఒక పని కాదని, అది ఒక ప్రత్యేకత అని పేర్కొన్నారు. క్రియా విశ్వవిద్యాలయం నుంచి  మీ గ్రాడ్యుయేషన్ కలలు నిజమవుతాయన్నారు.


క్రియా అనేది అర దశాబ్దం క్రితం కొందరి వ్యక్తుల ఒక కల అని, వారు తమ కలను చాలా మందితో పంచుకున్నారని అన్నారు. మీ గ్రాడ్యుయేషన్ ఆ కలలో భాగమైన సాకారమని, అది ఇక్కడితో ముగియదని వివరించారు. క్రియా విశ్వవిద్యాలయం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా మారాలని మనం కలలు కని, ఆ కలల్ని నిజం చేసుకుందామని పిలుపునిచ్చారు.

 

Updated Date - 2022-07-05T01:01:09+05:30 IST