మెరుగైన పౌష్టికాహారం అందించండి

ABN , First Publish Date - 2022-08-04T05:27:16+05:30 IST

గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించాలని ఐటీడీఏ పీవో బి.నవ్య ఆదేశించారు. బుధవారం టెక్కలి మండలం భీంపురం గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆమె సందర్శించారు.

మెరుగైన పౌష్టికాహారం అందించండి
విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఐటీడీఏ పీఓ నవ్య

- ఐటీడీఏ పీవో నవ్య
టెక్కలి రూరల్‌, ఆగస్టు 3:
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం అందించాలని ఐటీడీఏ పీవో బి.నవ్య ఆదేశించారు. బుధవారం టెక్కలి మండలం భీంపురం గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలను, నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, విద్యాప్రమాణాలు తదితర వాటిని పరిశీలించారు. ఇటీవల భీంపురం ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనాలు అందించడంలేదనే పిర్యాధుల అందాయి. ఈ నేపధ్యంలో ఆమె ఆశ్రమ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న సమయంలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిబ్బందితో పలు అంశాలపై సమీక్షించారు. ఈమెతో పాటు ఆశ్రమ పాఠశాల ప్రఽధానోపాధ్యాయురాలు డి.ప్రశాంతకుమారి, సిబ్బంది ఉన్నారు.

షోకాజ్‌ నోటీసు జారీ
భీంపురం ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన మెనూ అందజేయడం లేదనే ఫిర్యాదుల మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.ప్రశాంతకుమారికి ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు వారం రోజుల్లో లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని జిల్లా ఎస్టీ వెల్ఫేర్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ అధికారి ఆదేశించారు.  

 
 

Updated Date - 2022-08-04T05:27:16+05:30 IST