ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , First Publish Date - 2022-05-16T04:35:43+05:30 IST

ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వైద్యులు ముందుండాలని ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, మ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా కేంద్రంలోని హై లైఫ్‌ కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన ఆరో తెలంగాణ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ (తానాకాన్‌) రాష్ట్రస్ధాయి సదస్సును ఆదివారం వారు ప్రారంభించారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
మంచిర్యాలలో తెలంగాణ హాస్పిటల్స్‌, నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ సభలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

- ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్య

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 15: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో వైద్యులు ముందుండాలని ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, మ్మెల్యే దుర్గం చిన్నయ్య,  జిల్లా కేంద్రంలోని హై లైఫ్‌ కాన్ఫరెన్స్‌ హాలులో నిర్వహించిన ఆరో తెలంగాణ హాస్పిటల్స్‌ అండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ (తానాకాన్‌) రాష్ట్రస్ధాయి సదస్సును ఆదివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో వైద్య వృత్తిపై గురుతరమైన బాధ్యత ఉందని చెప్పారు.  రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను కల్పిస్తూ సేవా నిరతిని చాటుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక రాయితీలు కల్పించారని చెప్పారు. రిజిస్ర్టేషన్‌ , ఇతర సౌకర్యాలు కల్పించి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారని అన్నారు. ,ప్రభుత్వ పథకాల అమలయ్యేందు కూడా వైద్యులను భాగస్వాములను చేశారన్నారు. ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు మొట్టమొదటగా సంప్రదించేది వైద్యులేనని చెప్పారు. అలాంటి వైద్యులు మానవీయ కోణాన్ని ప్రదర్శించి వైద్యో నారాయణో హరి అనే సూక్తిని నిజం చేస్తూ వారి పట్ల దైవత్వాన్ని ప్రదర్శించి సేవా భావాన్ని పెంపొందించాలన్నారు.  ఎలాంటి ఇబ్బందులున్నా తాము ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర స్దాయి సమావేశాన్ని మంచిర్యాలలో నిర్వహించుకునేందుకు కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు రమణను ఎమ్మెల్యేలు  అభినందించారు. ప్రైవేటు హాస్పిటల్స్‌, నర్సింగ్‌హోమ్‌ అసోసియేషన్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు, వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎన్‌. మల్లేష్‌, మంచిర్యాల మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, ఐఎంఏ జాతీయ, రాష్ట్ర అధ్యక్ష, ఉపాఽధ్యక్షులు రవీంద్రరెడ్డి, సంపత్‌రావు, నరేందర్‌రెడ్డి, తానా మంచిర్యాల అధ్యక్షుడు సాల్మాన్‌రాజు, జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అరవింద్‌, ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సులేమాన్‌,  అనిల్‌, కెమిస్ర్టీడ్రగ్టిస్టు జిల్లా అధ్యక్షు డు తొగరి సుధాకర్‌, వైద్యులు ఎస్‌. వెంకటేశ్వర్లు, సుమన్‌కుమార్‌, రవి ప్రసాద్‌, కుమారస్వామి, రఘునం దన్‌, అన్నపూర్ణ, గోలి శృతి, సమ త , కాటం లక్ష్మీనారాయణ, శ్రీనివా స్‌, సాల్మాన్‌రాజు, 33 జిల్లాల తా నా, ఐఎంఏ సభ్యులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T04:35:43+05:30 IST