Abn logo
Jul 26 2021 @ 22:56PM

పేదలకు మెరుగైన వైద్యం అందించాలి

బస్తీ దవాఖానాను ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌, అధికారులు

- వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

- అందుబాటులో అన్ని రకాల వైద్య పరీక్షలు  

- డయాలసిస్‌ రోగులకు తీరనున్న  కష్టాలు

- జిల్లాను వైద్య హబ్‌గా మారుద్దాం

వనపర్తి వైద్యవిభాగం, జూలై 26: రాష్ట్రంలోని   పేదలకు కార్పొరేట్‌ తరహా వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసా యశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని వివిధ వైద్య సేవలను ఆ యన ప్రారంభించారు. జిల్లా ఆస్పత్రిలోని డయాల సిక్‌ కేంద్రానికి అదనంగా మరో 5 డయాలసిస్‌ యంత్రాలను ప్రారంభించి మాట్లాడారు ఇక నుంచి డయాలసిస్‌ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన శ్రమ లేదని అన్నారు. రోజుకు40 మందికి డయాల సిస్‌ చేయ డానికి మరో 5 యంత్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా క్యాన్సర్‌, పక్షవా తం, షుగర్‌, కాలేయ, కిడ్నీ, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తు లకు ఉపశమనం కల్పించడం కోసం జిల్లాలో పాలి యేటిక్‌ కేంద్రం ఏర్పాటు  చేయడం జరుగుతుంద న్నారు. కోటి యాభై లక్షలతో జిల్లాలో ఆర్‌టీపీసీఆర్‌ కేంద్రాన్ని నిర్మించుకోవడం జరిగిందన్నారు. దీని ద్వారా మూడు గంటల వ్యవధిలోనే 500 మందికి పరీక్షలు చేయడం జరు గుతుందని తెలిపారు. వాటితో పాటు బస్తీ దావాఖానల ఏర్పాటుతో గర్భి ణులకు, చిన్నపిల్లలకు, దీర్ఘకాలిక రోగులకు, ఫిజి యోథేరిపీ, మానసిక రోగాలకు, స్త్రీవ్యాధి సమస్య లు, సాధారణ రోగాలకు సాయంకాలం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రా థమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందించే విధంగా వినూత్న సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. మొత్తానికి జిల్లాను వైద్య హబ్‌గా మార్చుకుందామని తెలిపారు. కార్యక్రమం లో కలెక్టర్‌  యాస్మీన్‌ బాషా, జిల్లా ఇన్‌చార్జి వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ చందూనాయక్‌, డిప్యూ టీ డీఎంఆండ్‌హెచ్‌వో డాక్టర్‌ శ్రీనివాసులు, ప్రజా ఆరోగ్య అధికారి డాక్టర్‌ రవిశంకర్‌, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రాంచందర్‌రావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హరీష్‌ సాగర్‌, మునిసిప ల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, అధికారులు పాల్గొన్నారు. 

అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు

వనపర్తి అర్బన్‌ : అర్హులందరికీ ప్రభు త్వం తెల్లరేషన్‌ కార్డులు మంజూరు చే సిందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. పట్టణంలోని జీ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌ సోమవారం రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరై  కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుంచి పేద ప్రజలు ఎదురుచూస్తున్న రేషన్‌ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలో 98 శాతం అర్హులైన వారికి అందజేస్తున్న ట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో 157404 రేషన్‌ కా ర్డులు ఉన్నాయని, వీటితో పాటు ప్రస్తుతం మం జూరు చేసిన 3302 కార్డుల లబ్ధ్దిదారులకు బియ్యం పంపిణీ జరుగుతుందని అన్నారు. అదేవిధంగా సో మవారం తన నివాసంలో సీఎం సహాయనిధి నుం చి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందిం చారు. కార్యక్రమంలో కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, జడ్పీ చైర్మన్‌ లోక్‌ నాథ్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌, మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌,  డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ సివిల్‌ సప్లై తహసీల్దార్‌ రాజేందర్‌గౌడ్‌, వివిధ శాఖల అధికా రులు పాల్గొన్నారు.