కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి

ABN , First Publish Date - 2022-01-20T06:00:01+05:30 IST

కొవిడ్‌ ని వారణ, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అంది ంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకోసం యంత్రాంగం సమష్టిగా కృషి చేయా లని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వైద్యాధికారులను ఆ దేశించారు.

కొవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి
కొవిడ్‌ బాధితులకు అందించే ఆహారాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

భోజనంలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్‌పై క్రిమినల్‌ కేసులు

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ హెచ్చరిక 

రిమ్స్‌ అధికారులతో సమీక్ష



ఒంగోలు(కార్పొరేషన్‌), జనవరి 19 : కొవిడ్‌ ని వారణ, బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అంది ంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, అందుకోసం యంత్రాంగం సమష్టిగా కృషి చేయా లని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వైద్యాధికారులను ఆ దేశించారు. బుధవారం ఒంగోలులోని జీజీహెచ్‌ అధికారులతో రిమ్స్‌లో సమీక్షించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ బాధితులకు క్షేత్రస్థాయిలోనే వైద్యం అందించేలా చూడాలన్నా రు. అందుకోసం ప్రజా ప్రతినిధుల సహకారం తీ సుకోవాలని చెప్పారు. జిల్లాకు తలమానికంగా ఉ న్న రిమ్స్‌లో కూడా అవసరమైన పడకలు, మం దులు, ఆక్సీజన్‌ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. గత రెండేళ్ళలో ఎదురైన అనుభవా లను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ఎలాంటి పరి స్థితినైనా ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కొవిడ్‌ బాధితులకు మెనూ ప్ర కారం భోజనం సరఫరా చేయడంలో కాంట్రాక్టర్‌ ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా తన దృష్టికి తీసుకురావాలన్నారు. భోజనంలో నాణ్యత లేకపో తే క్రిమినల్‌ కేసు పెట్టడంతోపాటు ఆ ఏజెన్సీని బ్లాక్‌లిస్ట్‌లో పెడతానని హెచ్చరించారు. రోగులకు అందించే భోజనాన్ని స్వయంగా పరిశీలించిన కలె క్టర్‌, కొవిడ్‌ బాధితులకు పెట్టే భోజనాన్ని ఆక స్మికంగా తనిఖీలు చేసి తాను కూడా తింటాన న్నారు. ఫిర్యాదులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత భోజన కాంట్రాక్టర్‌పై ఉందన్నారు. రిమ్స్‌ లో అగ్నిప్రమాద మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని అ ధికారులకు సూచించారు. అవసరమైతే తాను కూడా వస్తానని చెప్పారు.  ఈ సందర్భంగా కలె క్టర్‌ రిమ్స్‌లో రోగులకు అందించే భోజనం పరిశీలి ంచడంతోపాటు, ఆసుపత్రుల్లో బెడల్‌ ఏర్పాటు, ఆక్సీజన్‌ ప్లాంట్‌లను తనిఖీ చేశారు. సమావేశం లో జేసీలు చేతన్‌, కె.కృష్ణవేణి, నోడల్‌ ఆఫీసర్లు శ్రీ నివాస్‌విశ్వనాఽథ్‌, వెంకటేశ్వరరావు, డీసీహెచ్‌ఎస్‌ ఉష, డీఎంహెచ్‌వో పద్మావతి, సూపరింటెండెంట్‌ శ్రీరాములు, ఆర్‌ఎంవో వేణుగోపాలరెడ్డి, డాక్టర్‌ జాన్‌రిచర్డ్స్‌, తిరుమలరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-20T06:00:01+05:30 IST