ఘనంగా యోగా దినోత్సవం

ABN , First Publish Date - 2021-06-22T05:22:30+05:30 IST

ఘనంగా యోగా దినోత్సవం

ఘనంగా యోగా దినోత్సవం
ఫొటో: 21ఎస్‌పిటి 9: శామీర్‌పేట: మినీస్టేడియంలో యోగా చేస్తున్న యువకులు

తాండూరు/తాండూరు రూరల్‌/పరిగి(రూరల్‌)/కొడంగల్‌:  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరులో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తాండూరులోని సల్లా గార్డెన్‌లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమే్‌షకుమార్‌, కౌన్సిలర్లు లలిత, లావణ్య, బాలప్ప, జిల్లా మహిళ అధ్యక్షురాలు శ్రీలత, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని సిరిగిరిపేట్‌ వీరభద్రేశ్వర యూత్‌ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం గ్రామంలోని ఆలయ ఆవరణలో యువకులు యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో యువకులు భానుప్రకాష్‌, వెంకటేష్‌, శ్రీశైలం, కార్తిక్‌, మహేష్‌, కార్తిక్‌రెడ్డి, ప్రశాంత్‌ పాల్గొన్నారు. పరిగి పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్‌వీ గార్డెన్‌లో ఆపార్టీ నాయకులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్‌, బాలక్రిష్ణారెడ్డి, సర్పంచ్‌ నర్సింహా, ఆంజనేయులు, వెంకటయ్య పాల్గొన్నారు. అదే విధంగా తిరుమల వెంచర్‌ వద్ద పరిగి వాకింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి హన్మంతు ముదిరాజ్‌, వెంకటయ్య, రఘు, పాండు, లక్ష్మయ్య, అంబదాస, లక్ష్మికాంత్‌రెడ్డి, హరి, చందర్‌ యోగాసనాలు వేశారు. కొడంగల్‌లో బీజేపీ నాయకులు పూనంచంద్‌లాహోటి, మోహన్‌రావు, కే.చంద్రప్ప తదితరులు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక పూనంచంద్‌లాహోటి స్వగృహంలో యోగాసనాలు చేశారు.

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో.. 

మేడ్చల్‌/ఘట్‌కేసర్‌/శామీర్‌పేట: ఏడో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సోమవారం మేడ్చల్‌ మున్సిపల్‌ కిష్టాపూర్‌ రోడ్డులోని శ్రీనివాస కల్యాణ మండపంలో నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రూరల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పాతూరి ప్రభాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, యువమోర్చా అధ్యక్షుడు కానుకంటి వంశీ, విజయ్‌, శ్రీకాంత్‌, సర్వేశ్వర్‌రెడ్డి యోగాసనాలు వేశారు. గుండ్లపోచంపల్లిలో రూరల్‌ జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్‌ ఎ.మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.   రోజూ కొంత సమయం యోగా చేస్తే మనసిక ఒత్తిడి దూరం అవుతుందని యోగాచార్యులు టీఎల్‌ నర్సింహా రావు అన్నారు. ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. కొండాపూర్‌లోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో యోగా సాధన ఆరోగ్యానికి అవసరం అన్నారు. శ్వాస సమస్యలతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు. కౌన్సిలర్‌ మహేష్‌, వి.హనుమాన్‌, ఎం.నర్సింహరెడ్డి, శ్రీరాములు, రాజారమెష్‌ పాల్గొన్నారు. శామీర్‌పేట, మూడుచింతలపల్లి, తూంకుట మున్సిపాలిటీలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.

Updated Date - 2021-06-22T05:22:30+05:30 IST