ఘనంగా పీవీ జయంతి

ABN , First Publish Date - 2022-06-29T06:17:56+05:30 IST

మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జయంతి వేడుకలను నగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా పీవీ జయంతి
పీవీ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

కర్నూలు(అర్బన్‌), జూన్‌ 28: మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు జయంతి వేడుకలను నగరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి కర్నూలు డీసీసీ అధ్యక్షుడు సుధాకర్‌బాబు, కాంగ్రెస్‌ నాయకులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా సుధాకర్‌ బాబు మా ట్లాడుతూ తెలుగు జాతీ గర్వించదగ్గ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు జాన్‌ విల్సన్‌, ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బ్రతుకన్న, అభినాయుడు, బివీ సుబ్రహ్మణ్యం, సజ్జాద్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

కల్లూరు: 
తెలుగు వారి ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన మహానుబావుడు పీవీ నరసింహారావు అని నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహయాదవ్‌ అన్నారు. మంగళవారం నంద్యాల చెక్‌పోస్టులోని దామోదరం సంజీవయ్య భవన్‌లో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహరావు 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐసీసీ యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఏపీఆర్‌వో సతీష్‌ కుమార్‌, డీఆర్వో భీమ్‌ భరత్‌, జిల్లా ఉపాధ్యక్షుడు బాలస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి పాల్గొన్నారు.

కర్నూలు(కల్చరల్‌): దేశంలో నూతన ఆర్థిక విధానాలు తీసుకువచ్చిన రూపశిల్పి పీవీ నరసింహారావు అని ఏపీ బ్రాహ్మణ అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సముద్రాల హనుమంతరావు కొనియాడారు. మంగళవారం నగరంలోని పాత కంట్రోల్‌రూమ్‌ సమీపంలోగల కమిటీ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా అధ్యక్షుడు సండేల్‌ చంద్రశేఖర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచుగంటల శ్యామ్‌సుందర్‌ శర్మ, ఏపీ పురోహితుల సంఘం అధ్యక్షుడు రవిచంద్ర శర్మ, బ్రాహ్మణ సంఘం నాయకులు నాగవరపు రాజశేఖర్‌, చెరువు వెం కట దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-06-29T06:17:56+05:30 IST