Abn logo
Jun 21 2021 @ 23:51PM

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

సంగారెడ్డి జిల్లా కల్హేర్‌ మండలంలోని బీబీపేట్‌లో యోగా దినోత్సవం సందర్భంగా యోగా చేస్తున్న యువకులు

మెదక్‌ అర్బన్‌/చిన్నశంకరంపేట/వెల్దుర్తి/తూప్రాన్‌/నర్సాపూర్‌/రామాయంపేట/అల్లాదుర్గం/పెద్దశంకరంపేట/చిల్‌పచెడ్‌, జూన్‌ 21: యోగా వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవని, ప్రతి రోజు అరగంటపాటు యోగాసనాలు చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు.  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మెదక్‌, సంగారెడ్డి జిల్లాలో ఘనంగా నిర్వహించారు.  మెదక్‌ జిల్లా కేంద్రంలోని ఓ గార్డెన్‌లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌, యోగా గురువు ఆకుల రవి, చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు సూరారం, చందంపేటలో బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మాసాయిపేటలో యోగా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు కరణం గణేష్‌ రవికుమార్‌, తూప్రాన్‌లో రాష్ట్రపతి అవార్డు గ్రహిత యోగాచార్య రాంచంద్రం, లయన్స్‌క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ చైర్మన్‌ జానకీరామ్‌, నర్సాపూర్‌లో బీజీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్‌, రామాయంపేటలోని వివేకానంద విద్యాలయం, వెంకటేశ్వర కాలనీల్లో క్రీడాకారులు, యోగా మాస్టర్లు మద్దెల భరత్‌, ఇందూరి నరే్‌షగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పల్లె జితేందర్‌, అల్లాదుర్గంలోని మార్కెండేయ మందిరంలో బీజేపీ మండలాధ్యక్షుడు కాళ్ల రాములు, పెద్దశంకరంపేట మండలంలోని మూసాపేటలో జనహిత ఏకోపాధ్యాయ పాఠశాల ఆధ్వర్యంలో, చిల్‌పచెడ్‌ మండలంలోని పలు గ్రామాలలో యోగా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పలువురు యువకులు, బాలలు, నాయకులు యోగాసనాలు వేశారు.

సంగారెడ్డి జిల్లాలో

కంది/సంగారెడ్డి రూరల్‌/కల్హేర్‌/కంగ్టి/నారాయణఖేడ్‌/నాగల్‌గిద్ద, జూన్‌ 21: కంది మండలంలోని సంగారెడ్డి జిల్లా జైలులో ఖైదీలు, సిబ్బంది, కంది పరిధిలోని ఐఐటీహెచ్‌లో, సంగారెడ్డిలో పతాంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా గురువు నవాజ్‌రెడ్డి, కల్హేర్‌ మండలంలోని బీబీపేట్‌లో మహంకాళి యువజన సంఘం ఆధ్వర్యంలో యోగా ట్రైనర్‌ పిట్ల బాలక్రిష్ణ, కంగ్టిలో ఔదత్‌పూర్‌ పీఠాధిపతి మశ్చందర్‌నాథ్‌ మహారాజ్‌ ఆధ్వర్యంలో, పీహెచ్‌సీలో ఆయూష్‌ వైద్యాధికారి నారాయణరావు ఆధ్వర్యంలో, ఖేడ్‌ సోమవారం లయన్స్‌ క్లబ్‌, భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ ఆధ్వర్యంలో యోగా మాస్టర్‌ సాయినాథ్‌, నాగల్‌గిద్ద మండలలోని ఆయా గ్రామాల్లో శిక్షకులు, యువకులు, ప్రజాప్రతినిధులు యోగా కార్యక్రమాలను నిర్వహించారు. వీరితో పాటు పలు సంస్థల  ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు నిర్వహించి యోగా వల్ల కలిగే ఉపయోగాలు వాటి ఫలితాలను వివరించి ప్రజల్లో అవగాహన కల్పించారు.