ఘనంగా హనుమజ్జయంతి

ABN , First Publish Date - 2022-05-26T04:30:49+05:30 IST

జిల్లా కేంద్రం లోని చింతల హనుమాన్‌ దేవాలయంలో హను మాన్‌ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వ హించారు.

ఘనంగా హనుమజ్జయంతి
కొత్తకోట కన్యకాపరమేశ్వరి ఆలయంలో హన్‌మాన్‌ చాలీసా పూజలో పాల్గొన్న స్వర్ణాసుధాకర్‌రెడ్డి

- ఆంజనేయుడి ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

- చింతల హనుమాన్‌ దేవాలయంలో ఇరుముడి సమర్పించిన స్వాములు 

- కొత్తకోట కన్యకాపరమేశ్వరి ఆలయంలో హనుమాన్‌ చాలీసా పారాయణ ఉద్యాపనం

- స్వామికి ఆకుపూజ నిర్వహించిన మహిళలు 


వనపర్తి రాజీవ్‌ చౌరస్తా, మే 25: జిల్లా కేంద్రం లోని చింతల హనుమాన్‌ దేవాలయంలో హను మాన్‌ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వ హించారు. బుధవారం వేకువజాము నుంచి చింతల హనుమాన్‌ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. పిల్లాపాపలతో భక్తులు దేవాలయానికి చేరుకుని తమ ఇష్టదైవానికి పూజలు, అభిషేకాలు చేసి మొ క్కులు తీర్చుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన హోమంలో భక్తులు పాల్గొని ఆంజ నేయ నామస్మరణం చేశారు. హనుమాన్‌ మాల ధ రించిన స్వాములు ఇరుముడితో చింతల హనుమాన్‌ దేవాలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా దేవాల యానికి వచ్చిన భక్తుల కోసం పలువురు దాతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 

 హనుమాన్‌ చాలీసా పారాయణంతో అన్నీ శుభాలే 

- జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి


కొత్తకోట : హన్‌మాన్‌ చాలీసా పారాయణం చేసే ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని కన్యకాపరమే శ్వరి దేవాలయంలో ఎంపీపీ గుంతమౌనిక ఆధ్వ ర్యంలో హనుమాన్‌ చాలీసా పారాయణ ఉద్యాపన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. చాలీసా పారాయణానికి ముందు ఆంజనేయస్వామికి మహిళ లతో కలిసి స్వర్ణాసుధాకర్‌రెడ్డి ఆకుపూజ నిర్వహిం చారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుకే శిని, మహిళలు పుష్పలత, రాధిక, వాణి, లక్ష్మీ, అనిత, యామినితో పాటు, మాజీ జీడ్పీటీసీ సభ్యుడు విశ్వే శ్వర్‌, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చంద్రకాంత్‌ తది తరులు పాల్గొన్నారు. 

ఆత్మకూర్‌ : హనుమాన్‌ జయంతి ఉత్సవా లను ఆత్మకూర్‌ మండలంలోని ఆయా గ్రామాల్లో భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆత్మకూర్‌, గుంటి పల్లి, మొట్లంపల్లి గ్రామాల్లో హనుమాన్‌ భక్తులు ద్విచక్ర వాహనాలతో భారీ వాహనర్యాలీ చేపట్టారు. అనంతరం హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా, మండలంలోని మూల మల్ల గ్రామంలో 12 అడుగుల ఉత్సవ విగ్రహంతో పాండురంగస్వామి ఆలయం నుంచి హనుమాన్‌ ఆలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. హనుమాన్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కీర్తనలు ఆలపించి భక్తిశ్రద్ధలతో భారీ ర్యాలీ నిర్వ హించారు. కార్యక్రమానికి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ గాయత్రి, వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్‌ రామకృష్ణ, వ్యవసాయ మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ వేణు గోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల కోశాధికారి ఆనంద్‌ గౌడ్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్య క్రమంలో హనుమాన్‌ ఉత్సవ కమిటీ నాయకులు పాల్గొన్నారు.

పెద్దమందడి : మండల పరిధిలోని దొడ గుంటపల్లి గ్రామంలో బుధవారం ఆంజనేయస్వామి దేవాలయంలో ఘనంగా హనుమాన్‌ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి ఆకు పూజ, వ్రతం, పాలాభిషేకం వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, మహిళలు, యువకులు అధిక సంఖ్యలో ఆంజనేయస్వామి వ్ర తంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం హనుమాన్‌ శోభాయాత్రను నిర్వహించారు. యువకులు గ్రామ స్థులు భక్తిశ్రద్ధలతో భజన కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో హనుమాన్‌ ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.

కొత్తకోట : పట్టణంలో హనుమాన్‌ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రథంపై ఆంజ నేయస్వామి విగ్రహాన్ని ఉంచి యువకులు డీజే, తీన్మార్‌ పాటలతో శోభాయాత్ర నిర్వహించారు. కార్య క్రమంలో హిందువాహిని, విశ్వహిందూ పరిషత్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-05-26T04:30:49+05:30 IST