ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం

ABN , First Publish Date - 2021-05-18T05:14:29+05:30 IST

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరాముడి పట్టాభిషేకం సోమవారం ఘనంగా జరిగింది. జన్మనక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీరామచంద్రస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పట్టాభిషేకాన్ని నిర్వహించారు.

ఘనంగా శ్రీరామ పట్టాభిషేకం
శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు

రామతీర్థంలో కరోనా నిబంధనల నడుమ నిర్వహణ

నెల్లిమర్ల, మే 17: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి వారి దేవస్థానంలో శ్రీరాముడి పట్టాభిషేకం సోమవారం ఘనంగా జరిగింది. జన్మనక్షత్రం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీరామచంద్రస్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం స్వామివారి సన్నిధిలో ప్రాతఃకాలార్చన, బాలభోగం అయిన తర్వాత యాగశాలలో సుందర కాండ హవనం, ఆదిత్య హృదయ హవనం, సుదర్శన అష్టకం, సుదర్శన కవచం, హవనం తదితర కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తుల వద్ద రామాయణంలో పట్టాభిషేక సర్గను విన్నవించారు. ఉత్సవ మూర్తులకు పంచామృత అభిషేకాన్ని శాస్ర్తోక్తంగా నిర్వహించారు. రామాయణం విశేషాలను భక్తులకు వివరించారు. అనంతరం మంగళాశాసనం, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమాలను దేవస్థానం ఈవో డీవీవీ ప్రసాదరావు పర్యవేక్షించారు. అర్చకులు ఖండవిల్లి సాయిరామాచార్యులు, కిరణ్‌, గొడవర్తి నరసింహాచార్యులు, పాణంగిపల్లి ప్రసాద్‌, పవన్‌కుమార్‌, రామగోపాల్‌ తదితరులు పూజలు చేశారు.


Updated Date - 2021-05-18T05:14:29+05:30 IST