ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

ABN , First Publish Date - 2020-07-10T11:39:42+05:30 IST

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం పట్టణంలోని ఎల్‌ఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించారు.

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

గద్వాల టౌన్‌/ అయిజ/ జూలై 9 : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం పట్టణంలోని ఎల్‌ఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్వహించారు. యూనియన్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పాలమూరు, నల్లగొండ జిల్లాల సంభావిత్‌ ప్రముఖ్‌ బిజాపూర్‌ ఖరేంద్రనాథ్‌ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ సతీశ్‌, శ్రీనివాసులు, నాగరాజు, హరి, నవీన్‌, సురేశ్‌, త్రివేణి, ఉమాదేవి, ప్రేమలత, మాధవి తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో  విద్యార్థులు మొక్కలు నాటారు. అయిజలోని తెలంగాణ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు జిల్లా ప్రముఖ్‌ ఆంజనేయులు ఏబీవీపీ జెండాను ఎగరవేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి మునిస్వామి, నవీన్‌, చందు, నరేష్‌, చంటి, వీరేష్‌, వీరశంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, ప్రవీన్‌, నరేంద్ర, వీరేష్‌, ఉరుకుందుశెట్టి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-10T11:39:42+05:30 IST