పార్టీ కార్యకర్తనని చెప్పుకోవడానికి గర్వపడతా..

ABN , First Publish Date - 2022-06-29T06:28:59+05:30 IST

తాను మంత్రినే అయినా వైసీపీ కార్యకర్తనని చెప్పుకోవడానికి గర్వపడతానని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు.

పార్టీ కార్యకర్తనని చెప్పుకోవడానికి గర్వపడతా..
ప్లీనరీలో మాట్లాడుతున్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

విపక్షాల విమర్శలను తిప్పికొట్టండి

వైసీపీ అనకాపల్లి ప్లీనరీలో మంత్రి అమర్‌నాథ్‌

అనకాపల్లిటౌన్‌, జూన్‌ 28: తాను మంత్రినే అయినా వైసీపీ కార్యకర్తనని చెప్పుకోవడానికి గర్వపడతానని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. స్థానిక రింగురోడ్డులోని పెంటకోట కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన అనకాపల్లి నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ శ్రేణులు ఎంత కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదన్నారు. విశాఖ జిల్లా అభివృద్ధికి సీఎం జగన్‌ చర్యలు తీసుకుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖ పరిపాలనా రాజధాని కావడం తథ్యమన్నారు. అనకాపల్లి జిల్లాకు మంచిరోజులు వస్తున్నాయని, త్వరలోనే ఈ ప్రాంతంలో 70 ఎకరాల్లో ఆటోనగర్‌ నెలకొల్పుతున్నట్టు తెలిపారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి స్వతహాగా ఎదిగిన నాయకుడని అన్నారు. 

పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్లీనరీ జరిగేటప్పటికీ గ్రామ, వార్డు, మండల కమిటీలు సిద్ధంగా ఉండాలన్నారు. వాటిని సెంట్రల్‌ కమిటీ ఆమోదానికి పంపుతామన్నారు. ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి మాట్లాడుతూ కరోనా సమయంలో సైతం ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను వలంటీర్లు లబ్ధిదారులకు అందించారన్నారు. పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు అధ్యక్షతన జరిగిన ఈ ప్లీనరీలో పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, సతీష్‌వర్మ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్‌, ముక్కా మహాలక్ష్మినాయుడు, రాజా రాం, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ బీవీ సత్యవతి, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పలకా యశోధ, ఎంపీపీ గొర్లి సూరిబాబు, కార్పొరేటర్లు నీలిమ, సునీత, ప్రసన్నలక్ష్మి, లక్ష్మీసౌజన్య, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పలకా రవి, పట్టణశాఖ అధ్యక్షుడు జాజుల రమేష్‌, పార్టీ యువ నాయకుడు దాడి జయవీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T06:28:59+05:30 IST