‘సెయింట్ ఆన్స్‌కు ఏ గ్రేడ్ రావడం గర్వకారణం’
ABN , First Publish Date - 2022-01-28T05:36:55+05:30 IST
స్థానిక సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలకు నాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) ఏ గ్రేడ్ లభించడం ఎంతో గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ ప్రేమకుమారి అన్నారు.
మల్కాపురం, జనవరి 27 : స్థానిక సెయింట్ ఆన్స్ డిగ్రీ కళాశాలకు నాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) ఏ గ్రేడ్ లభించడం ఎంతో గర్వకారణమని కళాశాల ప్రిన్సిపాల్ సిస్టర్ ప్రేమకుమారి అన్నారు. కళాశాలలో గురువారం నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ యాజమాన్యం, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థుల సమష్టి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ గెసిల్లా మాట్లాడుతూ కళాశాలకు ఏ గ్రేడ్ సాధించడంలో తోడ్పడిన వారికి అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుల తరఫున ఈపీఎస్ భాగ్యలక్ష్మి, బోధన సిబ్బంది తరఫున చంద్రకళ, విద్యార్థుల తరఫున పర్వీన్ ప్రసంగించారు. అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.