గర్వకారణం మన రాజ్యాంగం

ABN , First Publish Date - 2021-01-26T06:48:10+05:30 IST

రెండు వందల సంవత్సరాలకుపైగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం పాలన జరిగాక, స్వాతంత్ర్యం తర్వాత 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్...

గర్వకారణం మన రాజ్యాంగం

రెండు వందల సంవత్సరాలకుపైగా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం పాలన జరిగాక, స్వాతంత్ర్యం తర్వాత 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చైర్మన్‌‍గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరం 1949 నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రాజ్యాంగాన్ని అంబేడ్కర్ రెండు సంవత్సరాల పదకొండునెలల పద్దెనిమిదిరోజుల కాలంలో పూర్తి చేశారు. అలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమలుపరిచారు. నాటి నుంచి భారతదేశం 'సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం'గా రూపొందింది. మొదట్లో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని చట్ట సవరణకు వీలు లేకుండా రాశారు. అనంతరం అమెరికాకు చెందిన రాజ్యాంగవేత్త జెఫర్‍సన్‌కు భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ చదివి విన్పించారు. అప్పటికి జెఫర్‌సన్ దాదాపు 20-30 దేశాల రాజ్యాంగ రచన కమిటీలకు సలహాదారునిగా ఉన్నారు. రాజ్యాంగ రచన అంతా బాగుందని చెప్పిన జెఫర్‍సన్ భవిష్యత్తులో తలెత్తే పరిస్థితుల దృష్ట్యా భిన్న మతాలు, సంస్కృతులు ఉన్న దేశంగా చట్ట సవరణకు కూడా వీలుంటే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు 1/3 మెజారిటీతో పార్లమెంటులో చట్ట సవరణకు అవకాశం కల్పిస్తూ చట్టాన్ని పొందుపరిచారు. తల్లి కడుపులో ఉన్న శిశువుకూ హక్కులను వర్తింపజేసేలా భారత రాజ్యాంగ రచన జరిగింది గనకనే, ఆ రాజ్యాంగం దన్నుతోనే, నేడు మన దేశం ప్రపంచ దేశాల సరసన ధీమాగా నిలబడగలగుతోంది.

సంపత్ గడ్డం

Updated Date - 2021-01-26T06:48:10+05:30 IST