ప్రొటోకాల్‌ రగడ

ABN , First Publish Date - 2022-04-05T00:57:33+05:30 IST

నంద్యాల జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటోకాల్‌ పాటించలేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రొటోకాల్‌ రగడ

నంద్యాల: నంద్యాల జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా ప్రొటోకాల్‌ పాటించలేదంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిలాఫలకంపై తమ పేర్లు ఎందుకు లేవని కలెక్టర్‌‌ను ప్రశ్నించారు. సోమవారం నంద్యాల కొత్త జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం జరిగింది. మొదట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎం జగన్‌ జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభించి ఉపన్యసించారు. అనంతరం శిలాఫలకాన్ని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆవిష్కరించగానే అందులో ఉన్న పేర్లను చూడగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కంగుతిన్నారు. కొత్త జిల్లా పరిధిలో ఉండే ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల పేర్లలో ఐదుగురు ఎమ్మెల్యేల పేర్లు లేకపోవడం ప్రొటోకాల్‌ రగడకు తెరలేపింది. నంద్యాల జిల్లా పరిధిలోనికి వచ్చే శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ పేర్లను శిలాఫలకంలో చేర్చలేదు. దీంతో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కలెక్టర్‌ మన్‌జిర్‌ జిలాని సామూన్‌ను నిలదీశారు. తమ పేర్లు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఎస్పీ కార్యాలయం వద్ద శిలాఫలకంలో ఎమ్మెల్యేల పేర్లు లేకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-05T00:57:33+05:30 IST