ప్రొటోకాల్‌కు మంగళం!

ABN , First Publish Date - 2021-04-19T06:27:33+05:30 IST

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు సాక్షిగా రెవెన్యూశాఖ అధికారులు ప్రొటోకాల్‌ ఉల్లం ఘనకు పాల్పడ్డారు.

ప్రొటోకాల్‌కు మంగళం!

మంత్రి వెలంపల్లి సాక్షిగా ఉల్లంఘన

టీడీపీ కార్పొరేటర్‌ మాఽధురిని ఆహ్వానించని రెవెన్యూ శాఖ 

మాజీ కార్పొరేటర్‌ చేతుల మీదుగా పట్టాల పంపిణీ.. సర్వత్రా విమర్శలు 

భవానీపురం, ఏప్రిల్‌ 18 : మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు సాక్షిగా రెవెన్యూశాఖ అధికారులు ప్రొటోకాల్‌ ఉల్లం ఘనకు పాల్పడ్డారు. భవానీపురం 43, 45 డివిజన్ల పరిధిలో ఏకలవ్వనగర్‌లో క్రమబద్దీకరించిన పేద ఇళ్లపట్టాల పంపిణీ ఆదివారం రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో జరిగింది. 115 మందికి పట్టాలివ్వాల్సి ఉండగా 20 మంది వరకు మంత్రి వెల్లంపల్లి, వైసీపీ నేతల చేతుల మీదుగా పంపిణీ చేశారు. 43వ డివి జన్‌ వైసీపీ కార్పొరేటర్‌ బాపతి కోటిరెడ్డి హాజరుకాగా, 45వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ మైలవరపు మాధురి లావణ్యను రెవెన్యూశాఖ అధికారులు ఆహ్వానించలేదు. బ్యానర్‌లో ఆమె పేరు, పదవి లేకపోగా ఆమె స్థానంలో మాజీ కార్పొరేటర్‌, 45వ డివిజన్‌ వైసీపీ ఇన్‌ఛార్జ్‌ అంటూ బట్టిపాటి సంధ్యారా ణి పేరుతో ముద్రించింది.పార్టీ పదవులు కూడా లేని మద్దిల రామకృష్ణ, శివతో కూడా పట్టాలిప్పించేశారు. డివిజన్‌ అధ్య క్షుడు కంది శ్రీనివాసరెడ్డి, ఇతర నేతలూ పట్టాలిచ్చారు. తహసీల్దారు ఎం. మాఽధురి హాజరు కాలేదు. సభ నిర్వహిం చిన వీఆర్వో సిరివెన్నెలను ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా తనకు తెలియదని నోరు వెళ్లబెట్టారు. బ్యానర్‌ తాను వేయించి కాదని తప్పించుకున్నారు. టీడీపీ కార్పొరేటర్‌ మాధురి లావణ్య మాట్లాడుతూ మంత్రి కార్యక్రమం కాబట్టి పిలు స్తారని చూశానని, హాజరవ్వడానికి సిద్ధంగా ఉన్నా పిలవక పోవడం బాధాకరమన్నారు. దీనిపై కమిషనర్‌, ఇతర అధి కారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఇదిలా ఉండ గా క్రమబద్దీకరించిన పట్టాలపై ఏ సర్వే నెంబర్‌లో ఉన్నది ప్రస్తావించకపోవడంతో లబ్ధిదారులు రుణాలు పొందడంలో ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. 

Updated Date - 2021-04-19T06:27:33+05:30 IST