వైసీపీ దాడులపై నిరసనలు

ABN , First Publish Date - 2021-10-20T05:51:44+05:30 IST

టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ టీడీపీ శ్రేణులు మంగళవారం రాత్రి సింగరాయకొండలోని కందుకూరు రోడ్డు కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు.

వైసీపీ దాడులపై నిరసనలు
రోడ్డుపై బైఠాయించిన టీడీపీ శ్రేణులు

 రోడ్డుపై బైఠాయింపు

 ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు

సింగరాయకొండ, అక్టోబరు 19: టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు  చేసిన దాడిని ఖండిస్తూ టీడీపీ శ్రేణులు మంగళవారం రాత్రి సింగరాయకొండలోని కందుకూరు రోడ్డు కూడలిలో బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాష్ట్రంలో పలు టీడీపీ కార్యాలయాలు, నాయకుల నివాసాలపై ఏకకాలంలో పక్కా వ్యూహం ప్రకారం వైసీపీ కార్యకర్తలు చేసిన దాడు లను హేయమైన చర్యగా అభివర్ణించారు.  వైసీపీ నాయకులు రాష్ట్రాన్ని రావణకష్టంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించకోక తప్పదని హెచ్చరించారు. వైసీపీ నాయకులు చేసే మాఫియాలపై టీడీపీ నాయకులు ప్రశ్నించినందుకే ఓర్వలేక ఈ తరహా దాడులకు తెగబడటం దారుణమన్నారు. నిరసన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వేల్పుల సింగయ్య, చీమకుర్తి వెంకటేశ్వర్లు, కూన పురెడ్డి సుబ్బారావు, సుదర్శి చంటి, ఇమ్మిడిశెట్టి రామారావు, పోనుగోటి కొండయ్య, గాలి హరిబాబు, మించల బ్రహ్మయ్య, వేల్పుల వెంట్రావు, నక్కా బ్రహేశ్వరరావు, చీమకుర్తి కృష్ణ ఓలేటి రవిశంకర్‌రెడ్డి, షేక్‌ అబ్థుల్‌ సుబానీ, అజీమ్‌, కళ్లగుంట నరసింహ, నర్రా రాంబాబు, సన్నెబోయిన మాలకొండయ్య,  శ్రీను, రావులపల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

కొండపి: అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంతోపాటు, పలు జిల్లాల్లో టీడీపీ కార్యాలయాలపై, నాయకులపై వైసీపీ నాయకులు దాడులు చేయడాన్ని కొండపి మాజీ ఎమ్మెల్యే గుండపనేని అ చ్యుతకుమార్‌ తీవ్రంగా ఖండించారు. ఆయన మంగళవారం రాత్రి ఫోన్‌లో ఆంధ్రజ్యోతి విలేకరితో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదన్నారు. టీడీపీ కార్యాలయాలు, నాయకులపై వైసీపీ నాయకులు, శ్రేణులు దాడులు చేయడం సహించరాని దన్నారు. దాడులను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. దాడులు చేయడం ద్వారా పార్టీలు కనుమరుగవుతాయని అనుకోవడం వైసీపీ నాయకుల భ్రమేనని అచ్యుత్‌కుమార్‌ పేర్కొన్నారు.

దాడి హేయం

కొండపి, అక్టోబరు 19: టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై, నాయకుల ఇళ్లపై వైసీపీ రౌడీ మూకలు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని కొండపి ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర నాయకుడు డోలా శ్రీబాలవీరాం జనేయస్వామి తీవ్రంగా ఖండించారు. దాడులు చేయడం ద్వారా ఏమీ సాధించలే రన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులకు అవకాశం లేదన్నారు. వైసీపీ శ్రేణుల దాడులకు తగినమూల్యం తప్పక చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను గమనిస్తున్నారని చెప్పారు. వైసీపీ నాయకుల దాష్టీకాలను చూస్తున్నారన్నారు. తగిన సమయంలో ఆపార్టీకి బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే స్వామి అన్నారు. 

ఇవి ప్రభుత్వ ప్రేరేపిత దాడులే!

టంగుటూరు, అక్టోబరు 19: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నాయకుల ఇళ్లపై వైసీపీ దాడులు ప్రజాస్వామ్యంపై దాడేనని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య  విమర్శిం చారు. ఒకటొటిగా బయటకు వస్తున్న ప్రభుత్వ అరాచకాలతో ఆందోళన లో పడ్డ ప్రభుత్వ పెద్దలు తమ పార్టీ శ్రేణులను టీడీపీపై దాడులకు ప్రేరేపిస్తున్నారని, మంగళవారం నాటి దాడులన్నీ ప్రభుత్వ ప్రేరేపిత దాడులేనన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని, చేతిలో అధికారం ఉందికదా అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించు కోక తప్పదన్నారు. అధికార వైసీపీ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని, అవకాశం రాగానే ప్రభుత్వానికి తగిన బుద్ది చెవుతారన్నారు. దాడుల వార్త తెలియగానే మంగళగిరిలోని పార్టీ కార్యాల యానికి సత్య బయలుదేరారు. వైసీపీ దాడులకు నిరసనగా బుధవారం జరుగనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని సత్య కోరారు  

నేడు బంద్‌

సింగరాయకొండ, అక్టోబరు 19: టీడీపీ జాతీయ కార్యాలయంతో పాటు రాష్ట్రంలో పలు టీడీపీ కార్యాలయాలపై, నాయకుల నివాసాలపై ఏకకా లంలో జరిగిన దాడులకు నిరసనగా రాష్ట్రపార్టీ ఆదేశాల ప్రకారం బుధ వారం కొండపి నియోజకవర్గంలో బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే స్వా మి మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.  సింగరాయకొండలో జరిగే బంద్‌లో  స్వామితో పాటు దామచర్ల సత్య పాల్గొననున్నారు.  టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని స్వామి కోరారు.

Updated Date - 2021-10-20T05:51:44+05:30 IST