విద్యుత్‌ సవరణ బిల్లుపై నిరసనలు

ABN , First Publish Date - 2020-06-02T10:55:58+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2020 విద్యుత్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాలు నిరసన

విద్యుత్‌ సవరణ బిల్లుపై నిరసనలు

 ఉద్యోగుల నుంచి కార్మికుల దాకా వ్యతిరేకమే


కడప (సిటి), జూన్‌ 1: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2020 విద్యుత్‌ సవరణ బిల్లుకు  వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు, కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. నేషనల్‌ కోఆర్డినేషన్‌ కమిటి ఆఫ్‌ ఇంజనీరు అండ్‌ ఎంప్లాయీస్‌ పిలుపు మేరకు సోమవారం కడపలోని విద్యుత్‌ భవన్‌ వద్ద 16 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈ సవరణ బిల్లును పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.


ఈ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్రాలు తమ హక్కులను కోల్పోతాయని తద్వారా రైతులు, విద్యుత్‌ వినియోగదారులు విపరీతమైన భారం మోయాల్సి వస్తుందని చెప్పారు. ఈ బిల్లును అడ్డుకునేందుకు సంఘటితంగా పోరాడాలన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా కడప పవర్‌ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్‌ భవన్‌లో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎస్పీడీసీఎల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీరు ఎన్‌.శ్రీనివాసులు, డీఈ (టి) శోభ నిరసన ఉద్దేశ్యం, బిల్లు గురించి వివరించారు.

Updated Date - 2020-06-02T10:55:58+05:30 IST