అభద్రతా భావంతోనే దాడులు

ABN , First Publish Date - 2022-01-28T05:35:46+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ ప్రభంజ నాన్ని తట్టుకోలేకపోతున్న అధికార పార్టీ నాయ కులు, అభద్రతా భావంతోనే దాడులు చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి విమర్శించారు.

అభద్రతా భావంతోనే దాడులు
గద్వాలలో గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి 

- ఎంపీ అరవింద్‌పై దాడికి పలు చోట్ల నిరసనలు 

గద్వాల టౌన్‌/ మల్దకల్‌/ అయిజ/ అలంపూర్‌/ రాజోలి. జనవరి 27 : రాష్ట్రంలో బీజేపీ ప్రభంజ నాన్ని తట్టుకోలేకపోతున్న అధికార పార్టీ నాయ కులు, అభద్రతా భావంతోనే దాడులు చేస్తున్నారని జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి విమర్శించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై జరిగిన దాడి అందులో భాగమేనన్నారు. ఎంపీపై దాడిని నిరసిస్తూ పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు బీజేపీ నాయకులు నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకొని మౌనదీక్ష చేపట్టారు. అంతకుముందు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ దాడులకు భయపడేది లేదని, ప్రజాక్షేత్రంలో టీఆర్‌ఎస్‌కు ఎలా గుణపాఠం నేర్పాలో బీజేపీ నాయకత్వానికి తెలుసన్నారు. కార్యక్ర మంలో మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండల పద్మావతి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జీఎల్‌ చందు, శ్రీనివాస్‌గౌడ్‌, రంజిత్‌కుమార్‌ ఉన్నారు. 


- ఎంపీ అరవింద్‌పై దాడిని నిరసిస్తూ మల్దకల్‌ మండల కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకుని మౌనదీక్ష నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్ర మంలో నాయకులు లక్ష్మన్న, దామ నాగరాజు, గోవిందు, తిరుపతిరెడ్డి, ప్రకాశ్‌, గోపాల్‌, దామ వెంకటేశ్‌, నర్సింహానాయక్‌, లవన్న, చంద్రన్న, నర్సింహులు, దర్ళెల్లి, కిశోర్‌ పాల్గొన్నారు. 

 

- అయిజలో బీజేపీ మండల అధ్యక్షుడు శేఖర్‌, పట్టణ అధ్యక్షుడు నర్సింహయ్యశెట్టి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ముందు నాయకులు నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గోపాలకృష్ణ, ప్రదీప్‌కుమార్‌, వెంకటేష్‌, అంజి, కృష్ణ, పరశురాము, చెన్నప్ప, రమేష్‌, నవీన్‌, వీరేష్‌గౌడు, భీమన్న, భరత్‌, నరేష్‌, పాపయ్యాచారి తదితరులు పాల్గొన్నారు.


- అలంపూర్‌ పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు బీజేపీ నాయకులు నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకొని మౌనప్రదర్శన చేపట్టారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు నాగమద్దిలేటి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ప్రధాన కార్య దర్శి మల్లికార్జున యాదవ్‌, యువ మోర్చా మండల అధ్యక్షుడు సుధాకర్‌ యాదవ్‌, యువ మోర్చా పట్టణ అధ్యక్షుడు శరత్‌బాబు, ఓబీసీ మోర్చా ఉపా ధ్యక్షుడు ఈశ్వరయ్య, సెక్రటరీ శ్రీనివాసులు, ముని స్వామి పాల్గొన్నారు.


- రాజోలి పట్టణంలోని గాంధీ విగ్రహం ముందు బీజేపీ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వ ర్యంలో నోటికి నల్లరిబ్బన్‌ కట్టుకొని మౌనదీక్ష చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు అంజనేయులు, శశికుమార్‌, రాము, గోవిందురాజు, వెంకటేష్‌, మహేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T05:35:46+05:30 IST