ధరల పెరుగుదలపై 17 నుంచి నిరసనలు

ABN , First Publish Date - 2022-08-13T07:46:46+05:30 IST

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణాన్ని నిరసిస్తూ ఈ నెల 17 నుండి కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గస్థాయిలో నిరసన ప్రదర్శన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు.

ధరల పెరుగుదలపై 17 నుంచి నిరసనలు

ఏఐసీసీ నాయకుడు మహేశ్వర్‌రెడ్డి

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 12 : దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణాన్ని నిరసిస్తూ ఈ నెల 17 నుండి కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గస్థాయిలో నిరసన ప్రదర్శన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన 23 వరకు సాగే ఈ నిరసన ప్రదర్శనలో ధరలపై చర్చ, మండీలు రిటైల్‌ మార్కెట్ల వంటి ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధికి ఎన్నో ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తే కేంద్రంలోని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేస్తూ ఆర్థికవ్యవస్థను కుంగదీస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కోట్లాది మంది ఉపాధిమార్గాలు కల్పించి సంపద సృష్టించగా ప్రధాని మోదీపాలనలో దేశప్రతిష్ట దిగజార్చి ప్రజా సంప ద దోపిడీదారులకు ధారాదత్తం చేస్తోందన్నారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో 28న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిరసన ర్యాలీ పెద్దఎత్తున ఉంటుందన్నారు. దేశప్రజలు అలోచించి నిర్ణయం తీసుకొనే సమయం ఆసన్నమైందని బీజేపీ సర్కారును గద్దె దించితేనే ప్రజలకు స్వాతంత్య్ర ఫలాలు అందుతాయని అన్నారు. అధికసంఖ్యలో శ్రేణులు పాల్గొని నిరసన కార్యక్రమాలు జిల్లాలో విజయవంతం చేయాలని పిలుపుని చ్చారు.


Updated Date - 2022-08-13T07:46:46+05:30 IST