నిరసనలకు అనుమతి లేదు

ABN , First Publish Date - 2021-04-22T05:12:15+05:30 IST

డివిజన్‌ పరిధిలో సమ్మెలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని డీఎస్పీ శ్రావణి తెలిపారు.

నిరసనలకు అనుమతి లేదు

డీఎస్పీ శ్రావణి

పాలకొండ: డివిజన్‌ పరిధిలో సమ్మెలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని డీఎస్పీ శ్రావణి తెలిపారు. బుధవారం రాత్రి పాలకొండలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ సామూహికంగా వచ్చి నిరసన తెలిపితే  కరోనా మరింత అధికంగా వ్యాప్తి చెందే అవకాశంఉందని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిరస నలకు అనుమతి ఇవ్వడంలేదని చెప్పారు. నిరసనల సమయంలో విధుల్లో ఉన్న నలుగురు సిబ్బంది కరోనా బారినపడ్డారని తెలిపారు. ఇప్పటికే డివిజన్‌లో తొమ్మిది మందికి కరోనా సోకిందని  చెప్పారు. ఎవరైనా న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఆయా కార్యాలయాల్లో వినతిపత్రాలు ఇవ్వాలి తప్పా నిరసనలు తెలియజేయవద్దని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. సమావేశంలో ఆమెతోపాటు సీఐ శంకరరావు, ఎస్‌ఐ ప్రసాద్‌లు ఉన్నారు.


 

Updated Date - 2021-04-22T05:12:15+05:30 IST