కబోర్డ్ తెరవగానే హై సెక్యూరిటీ బంకర్.. గొటబాయ ప్యాలెస్‌లో కనుగొన్న ఆందోళనకారులు

ABN , First Publish Date - 2022-07-10T20:57:15+05:30 IST

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష (Gotabaya Rajapaksa) భవనాన్నిచుట్టుముట్టిన

కబోర్డ్ తెరవగానే హై సెక్యూరిటీ బంకర్.. గొటబాయ ప్యాలెస్‌లో కనుగొన్న ఆందోళనకారులు

కొలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష (Gotabaya Rajapaksa) భవనాన్నిచుట్టుముట్టిన ఆందోళనకారులు భవనంలోని హై సెక్యూరిటీ బంకర్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక (Sri Lanka) పరిస్థితి నానాటికీ మరింత దిగజారుతుండడం, అధ్యక్షుడు రాజీనామాకు నిరాకరించడంతో ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలాదిమంది ఆందోళనకారులు శనివారం అధ్యక్ష భవనాన్నిచుట్టుముట్టారు. భవనం గేట్లను లాగిపడేసిన ఆందోళనకారులు భవనంలోకి చొరబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విలాసవంతమైన ఆయన నివాసంలోకి చొరబడిన ఆందోళనకారులు కబోర్డులా ఉన్న ఓ తలుపు తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. ఆ తలుపు వెనక ఉన్న దారిలో వెళ్లి చూస్తే విలాసవంతమైన హై సెక్యూరిటీ బంకర్ కనిపించింది.


కొందరు ప్యాలెస్‌ ఆసాంతం క్షుణ్ణంగా పరిశీలించగా,  మరికొందరు మంచాలపై కనిపించారు. ఇంకొందరు ప్యాలెస్‌లోని స్విమ్మింగ్‌ పూల్‌లో దూకి ఈత కొట్టారు. మరికొందరు ఆయన గదిలో విశ్రాంతి తీసుకుంటూ కెమెరాలకు చిక్కారు. మరోవైపు, ఆందోళనకారులు అధ్యక్ష భవనాన్ని చుట్టుముట్టడానికి ముందే పరారైన రాజపక్ష ఎక్కడున్నారన్న విషయం ఇప్పటికీ తెలియరాలేదు. పార్లమెంటు స్పీకర్ మహింద యప అబే‌వర్ధన (Mahinda Yapa Abeywardena)తో మాత్రం కాంటాక్ట్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) ప్రైవేటు నివాసానికి ఆందోళనకారులు నివారం నిప్పుపెట్టారు.   


Updated Date - 2022-07-10T20:57:15+05:30 IST