రాయదుర్గంటౌన్, మే 19: తాగు నీటి సమస్యపై గురువారం పట్టణంలోని 18వ వార్డు మేదరవీధి ప్రజలు సచివా లయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. 12 రోజు లుగా తాగునీరు సరఫరా కాక ఇబ్బం దులు పడుతున్నా మని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరా చేసేంతవరకు ఆందోళన విరమిం చేది లేదని భీష్మించారు. మున్సిపల్ అధికా రులు తాగునీటి ట్యాంకర్ పంపినా ప్రజలు దాని ని వెనక్కు పంపారు. అనం తరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సచివాల య అడ్మిన్‌కు అందజేశారు. తాగునీటి సరఫరా చేయక పోతే శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడ తామని హెచ్చరించారు.