గ్రామ సచివాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన

ABN , First Publish Date - 2022-10-03T06:31:05+05:30 IST

స్థానిక గ్రామ సచివాలయం-1 ఎదుట ఆది వా రం మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో బైఠాయించారు. సమావేశం నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు, సర్పంచ, ఎంపీటీసీలు సచివాలయం వద్దకు రాగా, విషయం తెలుసుకున్న బోయగేరి, సిండికేట్‌ బ్యాంక్‌ వీధి మహిళలు అడ్డుకున్నారు.

గ్రామ సచివాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన
నిరసన తెలుపుతున్న మహిళలు

పరిగి, అక్టోబరు 2: స్థానిక గ్రామ సచివాలయం-1 ఎదుట ఆది వా రం మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో బైఠాయించారు. సమావేశం నిర్వహించేందుకు మండల స్థాయి అధికారులు, సర్పంచ, ఎంపీటీసీలు సచివాలయం వద్దకు రాగా,  విషయం తెలుసుకున్న బోయగేరి, సిండికేట్‌ బ్యాంక్‌ వీధి మహిళలు అడ్డుకున్నారు. ఉప్పునీళ్లు తాగలేక కి లోమీటర్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నామని అధికారులతో వాగ్వాదానికి దిగారు. తాగునీటి సమస్య మరో 10 రోజు ల్లో పరిష్కరిస్తామని పంచాయతీ కార్యదర్శి అరుణ హామీతోశాంతించా రు. టీడీపీ కార్యకర్తలు సురేష్‌, హనుమయ్య, మహిళలు పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-03T06:31:05+05:30 IST