అదనపు విద్యుత్‌ చార్జీలు వసూలు తగదు

ABN , First Publish Date - 2022-08-12T05:13:34+05:30 IST

అదనపు విద్యుత్‌ లోడ్‌ పేరుతో అదనపు విద్యుత్‌ చారీజలు వసూలు తగదని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు అన్నారు.

అదనపు విద్యుత్‌ చార్జీలు వసూలు తగదు
వెంపలో నిరసన వ్యక్తం చేస్తున్న కేవీపీఎస్‌ ప్రతినిధులు

భీమవరం రూరల్‌, ఆగస్టు 11: అదనపు విద్యుత్‌ లోడ్‌ పేరుతో అదనపు విద్యుత్‌ చారీజలు వసూలు తగదని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు అన్నారు. ట్రూఆప్‌ చార్జీ విధించడాన్ని నిర సిస్తూ యమునాపల్లి, చినగరువు, పెదగరువు, వెంప గ్రామాల్లో కేవీపీ ఎస్‌ బృందం గురువారం పర్యటించి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. క్రాంతిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బకాయిలను మొత్తం ప్రజలపై భారాలు వేసిందన్నారు. బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇచ్చి సామాన్యుల నుంచి వసూలు చేయడం దారుణమన్నారు. దళితులకు ఇచ్చిన 200 యూనిట్లు సబ్సిడీ తొలగించడాన్ని టని ప్రశ్నించారు. తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ నాయకులు ఇంజేటి శ్రీనివాస్‌, కేవీపీఎస్‌ మండల నాయకులు పట్టెం గణపతి, ఇంజేటి త్రిమూర్తులు, భల్లా మణిరాజు, రాజారావు, కుచ్చనపల్లి బెంజిమన్‌, పండు, తదితరులు పాల్గొన్నారు.


పెనుగొండ: ట్రూ అప్‌ చార్జీల పేరుతో ప్రజలపై మోపిన భారాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి ఎస్‌. వెంకటేశ్వరరావు అన్నారు. పెనుగొండ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం అందించారు. మోదీ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లు ప్రతులను దహనం చేశారు. షేక్‌ పాదుషా, నీలాపు ఆదినారాయణ, గుర్రాల సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-12T05:13:34+05:30 IST