పాలకొల్లులో మహిళలతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంగర
పాలకొల్లు అర్బన్, మే 16: రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించడంలో ప్రభు త్వం విఫలమైందని ఎమ్మెల్సీ అంగర రామమోహన్ అన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలకు నిరసనగా తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కర్నేని రోజారమణి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గాంధీ బొమ్మల సెంటర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మెల్సీ అంగర మాట్లాడుతూ అడబిడ్డలకు రక్షణ కల్పించలేని జగన్ పాలన పోవాలన్నారు. దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్‌స్టేన్ ఫేక్ అని ఆయన విమర్శించారు. రోజారమణి మాట్లాడుతూ జగన్ పాలనలో ఆరోగ్య కేంద్రాలు సైతం అత్యాచార కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. జగన్ పాల నలో గ్రామానికి ఒక ఉన్మాది పుట్టుకొస్తున్నాడని రోజారమణి ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, ధనాని ప్రకాష్, కర్నేన గౌరునాయుడు, కోడి విజయభాస్కర్, బోనం నాని, ఎస్తేరు రాణి, పెండ్యాల భవాని, ఆర్.జ్యోతి, ధనలక్ష్మి, విజయలక్ష్మి, మేరీ నిర్మల కుమారి తదితరులు పాల్గొన్నారు.
నరసాపురం: పట్టణంలో టీడీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్ మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్‌లో కొద్దిసేపు రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ జగన్ పాలన లో మహిళలకు రక్షణ లేదన్నారు. కార్యక్రమంలో పాలూరి బాబ్జి, పద్మ, తిరుమాని శశిదేవి, జక్కం శ్రీమన్నారాయణ, కొప్పాడ రవి, తదితరులు పాల్గొన్నారు.