ఇసుక తరలింపును అరికట్టాలని నిరసన

ABN , First Publish Date - 2021-10-26T05:20:05+05:30 IST

మండలంలోని కొండ్రికర్ల గ్రామంలోని పెద్దవాగు నుం చిఅక్రమంగా ఇసుక తరలింపును అరికట్టాలని తహసీల్దార్‌ కార్యాలయం ముందు గ్రా మ స్థులు సోమవారం నిరసన తెలిపారు.

ఇసుక తరలింపును అరికట్టాలని నిరసన
మెట్‌పల్లి తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న కొండ్రికర్ల గ్రామస్థులు

భూసర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలి

మెట్‌పల్లి రూరల్‌, అక్టోబరు, 25 : మండలంలోని కొండ్రికర్ల గ్రామంలోని పెద్దవాగు నుం చిఅక్రమంగా ఇసుక తరలింపును అరికట్టాలని తహసీల్దార్‌ కార్యాలయం ముందు గ్రా మ స్థులు సోమవారం నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ నీరటి రాజేశ్‌కు వినతి ప త్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామశివారులోని పెద్దవాగు నుంచికోనరావుపేట గ్రామానికి చెందిన పలువురు అక్రమంగా ఇసుకను తరలి స్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని మెట్‌పల్లి పోలీసులకు అప్పగించామన్నారు. వాగు నుం చినిత్యం అక్రమంగా ఇసుకను తరలించడంతో వాగులో పెద్ద గుంతలు ఏర్పడి భూసారం కోల్పోతోందన్నారు. దీంతో పంటల దిగుబడి తగ్గి రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. గ్రామశివారులోని 108 సర్వే నెంబర్‌ గల ప్రభుత్వ భూమిలో కోనరావుపేట గ్రామానికి చెందిన వారు అక్రమించుకోడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. వెంటనే భూసర్వే చేపట్టి హద్దులను ఏర్పాటు చేయాలని, ఇసుక తరలింపును అరికట్టాలని తహ సీల్దార్‌ను కోరిన ట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి, నర్సయ్య, గంగారాం, అంజయ్య, సాయిలు, నాగయ్య, రాజలింగం, శ్రీనివాస్‌, భూమేశ్వర్‌, సత్యనారాయణ, గ్రామ స్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T05:20:05+05:30 IST