Advertisement
Advertisement
Abn logo
Advertisement

మద్యం దుకాణం వద్దు

గోపాలపురం, అక్టోబరు 26: జనావాసాల మధ్య ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దని గ్రామస్థులతో కలిసి వైసీపీ నేత బీరపల్లి కృష్ణకిషోర్‌ బాబు నిరసన వ్యక్తం చేశారు. గోపాలపురం చెక్‌పోస్టు సెంటర్‌ లో మద్యం దుకాణం ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు విద్యార్థులతో కలిసి మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. చెక్‌పోస్ట్‌ సెంటర్‌లో మానవహారంగా నిర్వహించి మద్యం దుకాణం వద్దని నినాదాలు చేశారు. వైసీపీ నేత బీరపల్లి కృష్ణకిషోర్‌ బాబు మాట్లాడుతూ జాతీయ రహదారికి అనుకుని ఉన్న గోపాలపురం నాలుగు రోడ్ల కూడలిలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మద్యం దుకాణానికి 10 మీటర్ల దూరంలో బస్టాండ్‌ ఉందన్నారు. దీంతో వచ్చే పోయే ప్రయాణికులతో నిత్యం ఈ ప్రదేశం రద్దీగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు బస్టాండ్‌లో వేచి ఉంటారన్నారు. జడ్పీ హైస్కూల్‌, ప్రబుత్వ జూనియన్‌ కళాశాల, పలు ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరగా ఉండడంతో మద్యం దుకాణం ఏర్పాటుతో పలు సమస్యలు తలె త్తుతాయన్నారు. ఎస్‌ఈబీ అధికారులు జనావాసాల నడుమ మద్యం దుకా ణాలు ఏర్పాటుచేస్తే జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసం ప్రజల మనోభా వాలకు వ్యతిరేకంగా మద్యం దుకాణాలు నిర్వహించడానికి స్థానిక నాయకు లు కొందరూ సహకరించడం బాధ కలిగిస్తుందన్నారు. అధికార పార్టీలో ఉండి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పాలకులు, నాయకులు ఇటువంటి చర్యలను ఖండించకపోగా వారి వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాన్ని జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చెక్‌పోస్ట్‌ సెంటర్‌లోనే మద్యం దుకా ణం ఏర్పాటుచేస్తే గ్రామస్థులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో గెల్లా శ్రీనుబాబు, కొండేపాటి రత్నాజీ చౌదరి, కుందుల నారాయణరావు, కొయ్యే శేఖర్‌, గెద్దాడ సత్యనారాయణ, తనమండ్ర బాబూరావు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement