ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని నిరసన

ABN , First Publish Date - 2021-05-07T04:01:56+05:30 IST

డీటీసీపీ అనుమతి లేని లే ఔట్‌లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరుతూ మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని నిరసన
సబ్‌రిజిష్ట్రార్‌కు వినతిపత్రం అందజేస్తున్న రియల్టర్లు, దస్తావేజు లేఖరులు

ఏసీసీ, మే 6 : డీటీసీపీ అనుమతి లేని లే ఔట్‌లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని కోరుతూ మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఎదుట రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.  రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల సంఘం నాయకులు చల్లగుల్ల విజయశ్రీ, వెంకటస్వామిలు మాట్లాడుతూ సబ్‌ రిజిస్ట్రార్‌ ఎల్‌ఆర్‌ఎస్‌, లే ఔట్‌ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల సబ్‌ రిజిస్ట్రార్లు డీటీసీపీ అనుమతి, ఎల్‌ఆర్‌ఎస్‌, నాలా కన్వర్షన్‌ లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారన్నారు. మంచిర్యాల సబ్‌ రిజిస్ట్రార్‌ కూడా అనుమతి లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.   మిగతా సబ్‌ రిజిస్ట్రార్‌ల మాదిరిగానే మంచిర్యాల సబ్‌రిజిస్ట్రార్‌ కూడా ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించాలని వినతిపత్రం అందజేశారు. పూదరి ప్రభాకర్‌, అగల్‌డ్యూటీ రాజు, దీపక్‌ ఉపాధ్యాయ్‌, మధుకర్‌, చారి పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-07T04:01:56+05:30 IST